హోంమంత్రి అమిత్‌షాతో ఎంపీ రఘురామకృష్ణంరాజు భేటీ

by srinivas |
Home Minister Amit Shah
X

దిశ, ఏపీ బ్యూరో: కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు భేటీ అయ్యారు. మంగళవారం ఢిల్లీలోని ఆయన ఛాంబర్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్, ఏపీ ప్రభుత్వంపై ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. తనపై ఏపీ ప్రభుత్వం రాజద్రోహం కేసు పెట్టిన అంశంపై చర్చించినట్లు తెలుస్తోంది. ఇదే కేసులో ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్‌పై కూడా చర్చించినట్లు తెలుస్తోంది. తన వాట్సాప్ చాటింగ్ బహిర్గతం చేసిన నేపథ్యంలో తన భద్రతపై ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది.

అలాగే వైసీపీ పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డి ఇటీవల కేంద్ర ప్రభుత్వంపైనా.. రాజ్యసభలో వ్యవహరిస్తున్న తీరుపై కూడా ఇద్దరి మధ్య చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. అలాగే రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితులు, పార్లమెంట్ సమావేశాలపై చర్చించినట్లు సమాచారం. అలాగే రాజద్రోహం కేసు విచారణలో భాగంగా తనపై పోలీసుల దాడి.. తన హక్కులకు భంగం కలిగించేలా ఏపీ ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఈ అంశంపై సభలో చర్చకు వచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరినట్లు కూడా తెలుస్తోంది.

ఈ సమావేశంలో ఎంపీ రఘురామ ఆరోగ్య పరిస్థితులపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా అడిగి తెలుసుకున్నారు. ఎంపీ రఘురామకృష్ణంరాజుపై ఏపీ ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేయడం.. మరోవైపు లోక్‌సభలో వైసీపీ దూకుడుగా ప్రవర్తిస్తున్న తరుణంలో రఘురామకృష్ణంరాజు కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో భేటీ కావడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.

Advertisement

Next Story

Most Viewed