జలవివాదంపై ఎంపీ రఘురామ సంచలన వ్యాఖ్యలు

by srinivas |
జలవివాదంపై ఎంపీ రఘురామ సంచలన వ్యాఖ్యలు
X

దిశ, ఏపీ బ్యూరో: ఆంధ్రా-తెలంగాణ రాష్ట్రాల మ‌ధ్య నెలకొన్న జలవివాదంపై నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు స్పందించారు. రాజకీయ అవసరాల కోసం ఇరు రాష్ట్రాల సీఎంలు ఉద్దేశపూర్వకంగా ఈ గొడవలు పెంచకూడదంటూ హితవు పలికారు. శుక్రవారం నవ సూచనల పేరుతో సీఎం జగన్‌కు లేఖ రాశారు. ఆ లేఖలో జలవివాదాలపై పలు సూచనలు చేశారు. న‌దీ జలాల విష‌యంలో జ‌గ‌న్ చేసిన వ్యాఖ్యలపై ఇరు రాష్ట్రాల ప్రజల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయని చెప్పుకొచ్చారు.

పొరుగు రాష్ట్రాలతో సత్సంబంధాలు కొన‌సాగించడం వల్ల ఎన్నో సమస్యలు పరిష్కరించుకోవచ్చుని తనతో సీఎం జగన్ ఎన్నోసార్లు చెప్పుకొచ్చారని గుర్తు చేశారు. మరి జల వివాదాలను ఎందుకు పరిష్కరించలేకపోతున్నారని ప్రశ్నించారు. తెలంగాణలో ఆంధ్రా ప్రజలు ఉన్నారని వారి కోసమే సంయమనం పాటిస్తున్నట్లు సీఎం జగన్ చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. అలాగే జలరగడపై ప్రధాని మోడీకి లేఖలు రాయడం వల్ల ఒరిగే ప్రయోజనం ఏమీ లేదన్నారు. ఈ విషయం జగన్‌కు సైతం తెలుసునన్నారు. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమావేశమై చ‌ర్చలతో సమస్యను పరిష్కరించుకోవాలని ఎంపీ రఘురామ లేఖలో కోరారు.

Advertisement

Next Story

Most Viewed