- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
వాటిని చెడగొట్టకండి -ఎంపీ రఘురామ
దిశ, వెబ్ డెస్క్: నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజు గురువారం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…ఆంధ్రప్రదేశ్ రాజధానుల వ్యవహారంపై కేంద్రం స్పందించిన తీరు బాధాకరం అన్నారు. రాజధానిని నిర్ణయించే హక్కు ఆయా రాష్ట్రాలకే ఉందని కేంద్ర ప్రభుత్వం అఫిడవిట్‌లో తెలపడం బాధ కలిగించిందన్నారు. కేంద్రం అఫిడవిట్‌తో ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.
రెడ్డొచ్చి మొదలు అన్నట్లు ఏపీ ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. కదిలించడానికి వీల్లేని హైకోర్టును కర్నూలులో పెడతామంటున్నారని.. దీనికి అభివృద్ధి వికేంద్రీకరణ అని పేరు పెట్టారని.. అభివృద్ధి కేంద్రీకరణ అని చెబితే బాగుంటుందని విమర్శించారు. విశాఖపట్టణం ఇప్పటికే అభివృద్ధి చెందిందని, అక్కడ లేనిదంటూ ఏమీ లేదని రఘురామకృష్ణం రాజు స్పష్టం చేశారు. శ్రీకాకుళంలో చాలా పరిశ్రమలు ఉన్నాయి. అభివృద్ధి చెందిన ప్రాంతాలను చెడగొట్టవద్దని అధికార ప్రభుత్వానికి సూచించారు.
ఎంతో అభివృద్ధి చెందిన విశాఖను అభివృద్ధి చేస్తామనడం కామెడీగా ఉందని ఎద్దేవా చేశారు. విశాఖ ప్రశాంత వాతావరణాన్ని పాడుచేయొద్దని హితవు పలికారు. జగన్‌కు రాయలసీమపై నిజమైన ప్రేమ ఉంటే అమరావతిలోనే రాజధానిని ఉంచి సీమలో న్యాయ రాజధాని పెట్టాలని సూచించారు. మనకి తప్పకుండా న్యాయం జరుగుతుందని, 3 రాజధానుల వ్యవహారంపై ప్రజలు ఆందోళన చెందవద్దని చెప్పారు ఎంపీ రఘురామకృష్ణరాజు.