- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
టీఆర్ఎస్ ఎంపీ గుర్రపు స్వారీ.. కరోనాపై వినూత్న ప్రచారం
దిశ, సిద్దిపేట: రాష్ట్రంలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. రోజూ రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలకు మహమ్మారిపై సంపూర్ణ అవగాహణ కల్పించాలని ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్సీ ఫారూక్ హుస్సేన్ వినూత్న ప్రయత్నం చేశారు. శుక్రవారం సిద్దిపేట జిల్లా కేంద్రంలో ఎంపీ, ఎమ్మెల్సీ గుర్రంపై తిరుగుతూ.. ప్రజలకు మాస్కులు పంపిణీ చేశారు. పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా నుంచి ముస్తాబాద్ చౌరస్తా వరకూ.. ‘మాస్కు ధరించండి.. కరోనాను అరికట్టండి’ అంటూ విధివీదినా తిరిగి ప్రచారం చేశారు. ప్రజలందరూ కరోనా బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కరోనా బారిన పడ్డ వాళ్లకు ఆస్పత్రుల్లో ఆక్సిజన్, బెడ్స్ సరిపోవడం లేదని అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరారు. సామాజిక దూరం పాటిస్తూ, శానిటైజర్ వాడుతూ మనల్ని మనం రక్షించుకోవాలని సూచించారు. సిద్దిపేట జర్నలిస్ట్ మిత్రుడు నాగరాజు కరోనాతో చనిపోవడం చాలా బాధాకరం అని వారికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.