- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
చంద్రబాబు పై రెచ్చిపోయిన ఎంపీ మిథున్ రెడ్డి
X
దిశ,ఏపీ బ్యూరో: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుపై వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంగ్లీషు మీడియంపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు దురదృష్టకరమన్నారు. చిత్తూరులో సోమవారం మీడియాతో మాట్లాడిన ఆయన ఆంగ్ల బోధనపై చంద్రబాబు విమర్శలు చేయడం సిగ్గుచేటన్నారు. చంద్రబాబు కొడుకు లోకేష్ ఏ మీడియంలో చదివాడో ప్రజలకు చెప్పాలని నిలదీశారు. ఇప్పుడు లోకేష్ కొడుకు ఏ మీడియంలో చదువుతున్నాడో కూడా ప్రజలకు వివరించాలని సూటిగా ప్రశ్నించారు. చంద్రబాబు కొడుకు, మనవడు ఇంగ్లీష్ మీడియంలో చదవొచ్చు.. కానీ పేద పిల్లలు మాత్రం ఇంగ్లీష్ మీడియంలో చదవకూడదా అని నిలదీశారు. విద్యకు సీఎం వైఎస్ జగన్ అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని..అది ఓర్వలేక చంద్రబాబు ఆరోపణలు చేస్తున్నారని ఎంపీ మిథున్‌రెడ్డి మండిపడ్డారు.
Advertisement
Next Story