ఎంపీ బంకులో భారీ ఆఫర్.. బిడ్డ పుట్టిందని ఫ్రీ పెట్రోల్

by Shyam |   ( Updated:2021-10-17 04:52:00.0  )
petroll-free
X

దిశ, ఫీచర్స్: మధ్యప్రదేశ్‌(ఎంపీ)లోని ఓ పెట్రోల్ పంప్ ఓనర్.. తన కుటుంబంలో ఆడపిల్ల పుట్టినందుకు బేతుల్‌ మునిసిపాలిటీలో ఉచితంగా పెట్రోల్ పంపిణీ చేసి ఆశ్చర్యపరిచాడు. తన సొంత చెల్లెలు శిఖా పోర్వల్‌ స్పెషల్లీ ఏబుల్డ్(ప్రత్యేక అవసరాలు గల) గల వ్యక్తి కాగా, ఆమె రీసెంట్‌గా పాపకు జన్మనివ్వడం అతనికి అమితమైన ఆనందాన్ని కలిగించింది. పైగా నవరాత్రి సమయంలో ఈ శుభవార్త వినడంతో ఆ క్షణాన్ని గుర్తుండిపోయేలా సెలబ్రేట్ చేయాలనుకున్న దీపక్.. తన ఆనందాన్ని కస్టమర్లందరితోనూ పంచుకోవాలనుకున్నాడు. అందుకే ఊహించని ఆఫర్‌ను ప్రకటించి చెల్లెలిపై ప్రేమను చాటుకున్నాడు.

మార్కెటింగ్ జిమ్మిక్కు కాదు..
ఉదయం 9 -11, సాయంత్రం 5-7 మధ్య కస్టమర్లు ఎక్కువగా రావడాన్ని గమనించిన దీపక్.. అదే టైమ్‌లో 5-10 శాతం డిస్కౌంట్ అందించాలని నిర్ణయించుకున్నాడు. ఈ మేరకు రూ.100/- పెట్రోల్ కొనుగోలు చేసిన వారికి 5 శాతం, రూ. 200 – రూ. 500 మధ్య కొనుగోలు చేసిన వారికి పది శాతం ఆఫర్ చేయబడుతుందని తెలిపాడు. ఈ ఆలోచన గొప్పదే అయినా అమలు చేసేముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించాడు. ఎందుకంటే ప్రజలు దీన్ని ఛీప్ పబ్లిసిటీ స్టంట్‌గా భావించకూడదనేది అతడి ఆలోచన కాగా చివరకు ఆఫర్ ఇవ్వాలని డిసైడ్ అయ్యాడు.

నెల కిందట భోపాల్‌కు చెందిన పానీ పూరి విక్రేత తన కుటుంబంలో ఒక అమ్మాయి పుట్టినందుకు రూ.50 వేల విలువైన చాట్‌ను పంపిణీ చేసిన సంగతి తెలిసిందే. రాజస్థాన్‌‌కు చెందిన ఒక వ్యక్తి తన కుటుంబంలో 35 సంవత్సరాల తర్వాత జన్మించిన ఆడబిడ్డను స్వాగతించేందుకు హెలికాప్టర్‌ను అద్దెకు తీసుకున్నాడు. అయితే దేశంలో ఇంధన ధరలు ఎన్నడూ లేనంతగా పెరిగిన సమయంలో ఇలాంటి చొరవ ఆలోచింపదగ్గదే. ఇక ఢిల్లీ, రాజస్థాన్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, ఒడిషా, జమ్మూ కశ్మీర్ తదితర రాష్ట్రాల్లో రూ.100 క్రాస్ అవడంతో ద్రవ్యోల్బణంపై తీవ్ర ప్రభావం కొనసాగుతూనే ఉంది.

Advertisement

Next Story