పరీక్షలేకుండానే పై చదువులకు

by Shamantha N |   ( Updated:2020-03-29 02:50:50.0  )
పరీక్షలేకుండానే పై చదువులకు
X

దేశంలో కరోనా వైరస్ విస్తరిస్తున్న నేపథ్యంలో మధ్యప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ కరోనా వైరస్ నివారణపై సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో టెన్త్​ అండ్​ ఇంటర్​ బోర్డు ఎగ్జామ్స్​ వాయిదా వేశామని, మిగతా అన్ని తరగతుల విద్యార్థులు పరీక్ష రాయకుండానే పై తరగతులకు అప్​గ్రేడ్​ అయ్యేలా నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. 1984 లో భోపాల్ గ్యాస్ విషాదం తర్వాత అప్పటి రాష్ట్ర ప్రభుత్వం బోర్డు పరీక్షలకు హాజరైన వారు మినహా అన్ని తరగతుల స్టూడెంట్స్​కు ఇటువంటి అవకాశమే కల్పించింది. పేదలకు రేషన్ కార్డులతో సంబంధం లేకుండా వచ్చే మూడు నెలల వరకు ఉచితంగా రేషన్ అందించాలని నిర్ణయించారు.

tags;mp govt is a key decision,For the above studies without conducting tests,cm shivraj singh chauhan

Advertisement

Next Story

Most Viewed