- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ట్యాంక్‌బండ్‌లో కొబ్బరి నీళ్లు సాధ్యమేనా !
దిశ, తెలంగాణ బ్యూరో: దేశంలో రాష్ట్రపతి తర్వాత అత్యధిక పారితోషికం తీసుకుంటున్నది తెలంగాణ సీఎం కేసీఆరేనని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ వ్యాఖ్యానించారు. సోమవారం ఆయన బీజేపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ పారితోషికం తీసుకుంటున్న ప్రధాని, ఉపరాష్ట్రపతి నిత్యం 12నుంచి 16గంటలు పనిచేస్తుంటే సీఎం మాత్రం ఫాంహౌస్‌కే పరిమితమయ్యారని విమర్శించారు. జీహెచ్ఎంసి ఎన్నికల్లో టీఆర్ఎస్‌కు గుణపాఠం చెప్పుతామని అన్నారు. ట్యాంక్‌బండ్‌లో కొబ్బరినీళ్ళు పోస్తామని సీఎం చెప్పారని అది సాధ్యమేనా అని ప్రశ్నించారు.
కేంద్రం ఇచ్చిన నిధులు ఇవే..
హైదరాబాద్ వరదలు వస్తే తక్షణ సాయం కింద రూ.224కోట్లు, రోడ్ల మరమ్మతులకు రూ.222 కోట్లు మొత్తం రూ.426 కోట్లు కేంద్రం నుంచి వస్తే ఒక్క పైసారాలేదని అనడం సిగ్గుమాలిన మాటలన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల కోసమే డబుల్ డెక్కర్ బస్సులను గుర్తు చేస్తున్నారని తెలిపారు. ఐఐటికి రూ. 80 కోట్లు, మినరల్ విభాగానికి రూ.313 కోట్లు, ఓసియన్ రీసెర్చ్ విభాగానికి రూ.28 కోట్లు, సాలార్జంగ్ మ్యూజియంకు రూ. 27.99 కోట్లు, ఐఐటికి రూ. 200 కోట్లు కేంద్రం కేటాయించిందని తెలిపారు.