తపస్ క్యాలండర్ ఆవిష్కరించిన ఎంపీ బీబీ పాటిల్..

by Shyam |   ( Updated:2021-12-26 09:41:39.0  )
తపస్ క్యాలండర్ ఆవిష్కరించిన ఎంపీ బీబీ పాటిల్..
X

దిశ, బిచ్కుంద: తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (తపస్) 2022 క్యాలెండర్ ను జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ అవిష్కరించారు. అదివారం కామారెడ్డి జిల్లా గురుకుల పాఠశాల పెద్ద ఎక్లారా లో ఆవిష్కరించారు. ఈ సంధర్బంగా ఎంపీ బీబీ పాటిల్ మాట్లాడుతూ.. ఉపాధ్యాయులు ఉన్నతస్థానంలో ఉండి విద్యార్థులను తీర్చి దిద్దాలని కోరారు. విద్యార్థులను భావి భారత పౌరులుగా తీర్చిదిద్ధితే వారే రేపటి భారతా వనిని మార్చగలుగుతారని పెర్కోన్నారు.

ఈ సంధర్బంగా ఉపాధ్యాయులకు, విద్యార్థులకు, శుబాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి డి సి సి బి డైరెక్టర్ రామ్ పటేల్, తపస్ జిల్లా కార్యదర్శి రచ్చ శివకాంత్, సొసైటీ చైర్మన్ శ్రీనివాస్ పటేల్, పండిత్ రావ్ పటేల్, ప్రదీప్ పటేల్, బన్సీ పటేల్, తపస్ బాధ్యులు యెన్నావార్ రాజ్ కుమార్, షేక్ ఖయ్యూం, జయచంద్ సంగమేశ్వర్, సంజయ్ గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ పి సవిత, ఉపాధ్యాయులు సునీత, కవిత, సుజాత, గంగాధర్, స్వప్న, శ్రీనివాస్, గౌసోద్దీన్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed