- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నీ వీడియోలు సీఎంకే పంపిస్తా : బండి సంజయ్
దిశ, కరీంనగర్ : ధాన్యం కొనుగోలు చేయమంటే ప్రజాప్రతినిధులను కొనడం స్టార్ట్ చేసిన మంత్రి గంగుల కమలాకర్ వీడియోలు ముఖ్యమంత్రి కేసీఆర్‌కే పంపిస్తానంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ వ్యాఖ్యానించారు. కరీంనగర్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్‌నే కలవరపెడుతున్న నాకు నీవో లెక్కనా అంటు మండిపడ్డారు. కరీంనగర్ జిల్లాకు గంగుల కమలాకర్ మంత్రిగా వ్యవహరిస్తున్నాడు తప్ప రాష్ట్రానికి కాదని విమర్శించారు. ఒక రాష్ట్ర మంత్రిగా గంగుల రాష్ట్రంలో ఎన్ని ప్రాంతాలు పర్యటించారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఇది ధర్మానికి, అ ధర్మానికి మధ్య జరుగుతున్న పోరాటమని, గంగుల షోప్ టప్ మంత్రి మాత్రమేనని, కేవలం మీడియా కవరేజ్ కోసం మాత్రమే ఆయన ఆరాటపడుతున్నారని బండి సంజయ్ దుయ్యబట్టారు.
ముఖ్యమంత్రి కేసీఆర్‌ను జైలుకు పంపే వరకు బండి సంజయ్ నిద్రపోడన్న విషయం గుర్తు పెట్టుకోవాలని, తొందర్లోనే ఆధారాలతో సహా బయటపెడతానని స్పష్టం చేశారు. నన్ను తిట్టి కేసీఆర్ దగ్గర మెప్పు పొందాలనుకునే వ్యక్తి మంత్రి గంగుల అని ఆయన తెలిపారు.తన వల్లే కమలాకర్‌కు మంత్రి పదవి వచ్చిందని, అప్పుడే మర్చిపోయావా..మంత్రి సిఫార్సు లేఖలన్నీ కరీంనగర్‌లో బినామీ గనుల కోసం వాడుతున్నాడని బండి ఆరోపించారు. గంగుల కమలాకర్ నా మీద అనవసరంగా కుక్కలా మొరుగుతూనే ఉన్నాడని, ఏదో రకంగా ప్రజలను తప్పుదోవ పట్టించడానికే ఈ ప్రయత్నాలన్నారు. కరోనా సమయంలో నేను కనిపించలేదంటూ వ్యాఖ్యలు చేసిన మంత్రికి కళ్ళు దొబ్బయేమో ఓ సారి చెక్ చేసుకుంటే మంచిదని సలహా ఇచ్చారు. కరీంనగర్ ప్రభుత్వ ఆస్పత్రి ఐసోలేషన్ కు రెండు సార్లు వెళ్లి పరిస్థితిని సమీక్షించిన విషయాన్ని మర్చిపోయారా, కరోనా సమయంలో కరీంనగర్‌లోని వైద్యులకు, ఉద్యోగులకు భరోసా ఇచ్చింది వాస్తవం కాదా అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. ఇన్ని రోజులు ఎమ్మెల్యే గా ఉన్న గంగుల నియోజకవర్గం కోసం ఏం చేశాడో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. మంత్రిని విమర్శించే చిల్లర స్థాయి నాది కాదని, ఇక మీదట అయినా జాగ్రత్తగా ఉండాలంటూ బండి సంజయ్ హెచ్చరించారు.