ఈ కష్టతరమైన సమయంలో మీరు ఇచ్చిన సపోర్ట్, ప్రేమ వెలకట్టలేనిది.. మంచు లక్ష్మి ఎమోషనల్

by Hamsa |
ఈ కష్టతరమైన సమయంలో మీరు ఇచ్చిన సపోర్ట్, ప్రేమ వెలకట్టలేనిది.. మంచు లక్ష్మి ఎమోషనల్
X

దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ హీరో మోహన్ బాబు కూతురిగా మంచు లక్ష్మి ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి పలు సినిమాలు చేసి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. అలాగే నిర్మాత గానూ తన సత్తా చాటింది. ప్రస్తుతం సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చి నిత్యం సోషల్ మీడియాలో పలు పోస్టులు పెడుతూ తనకు సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకుంటోంది. అయితే ఇటీవల మంచు లక్ష్మి వీసా రావట్లేదని తనకు సాయం చేయాలంటూ నెట్టింట ఓ పోస్ట్ షేర్ చేసిన విషయం తెలిసిందే. దీంతో చాలా మంది స్పందించి ఆమెకు సాయం చేసి సమస్యను పరిష్కరించారు.

తాజాగా, మంచు లక్ష్మి తనకు సాయం చేసిన వారందరికీ ధన్యవాదాలు చెప్తూ ఎమోషనల్ అయింది. ‘‘పాస్‌పోర్ట్ వొచ్చింది ఊచ్! చివరకు! సహాయం అందించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. ఈ ఒత్తిడితో కూడిన సమయంలో చాలా ప్రేమ మద్దతు వెలకట్టలేనిది. ఊహించని విధంగా సాయం చేసి సమస్యను పరిష్కరించారు. ఇది నిజంగా నా అద్భుతమైన టీమ్ శక్తిని నాకు చూపించింది. మీ ప్రేమ, పిచ్చికి కృతజ్ఞతలు!’’ అని రాసుకొచ్చింది.

Advertisement

Next Story

Most Viewed