- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పవన్ కల్యాణ్‌పై సెన్సేషనల్ కామెంట్స్ చేసిన యంగ్ హీరోయిన్
దిశ, వెబ్‌డెస్క్: పవర్ స్టార్ పవన్ కల్యాణ్, సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న ప్రతిష్టాత్మక చిత్రం ‘బ్రో’. జులై 28న ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. మొదటిసారిగా మామ అల్లుడు కలిసి నటిస్తోన్న ఈ చిత్రంలో కేతిక శర్మ కథానాయికగా నటిస్తోంది. అయితే తాను కేవలం పవన్ కోసమే ఈ మూవీలో నటించడానికి ఒప్పుకున్నానని తాజాగా అసలు కారణం బయటపెట్టింది హీరోయిన్ కేతిక.
‘‘ఈ మూవీకి ఓకే చెప్పడానికి పెద్దగా కారణాలేం లేవు. పవన్ కల్యాణ్ పేరు వింటే చాలు. నిజానికి ఈ చిత్రంలో నాకు, పవన్‌కు కాంబోలో సీన్లు లేవు. కానీ నటించిన సినిమాలో ఉండాలనుకున్నా. ఆయనను అంతకుముందు ఎప్పుడు కలవలేదు. ఫస్ట్ టైమ్ ఆయన్ని కలిసే ఛాన్స్ వచ్చింది చాలు. సెట్‌లో అడుగు పెట్టగానే పవన్‌ను చూసి మాట్లాడడానికి భయపడ్డాను. సాయిధరమ్ తేజ్ సహాయం తీసుకుని ఆయనతో మాట్లాడాను. పవన్ ఎటువంటి ఇగో లేకుండా ఆప్యాయంగా పలకరించడమే కాకుండా తన ఇంటి మనిషిలా యోగక్షేమాలు కూడా అడిగారు. ఇది నా లైఫ్‌లో మర్చిపోలేనిది.’’ అంటూ కేతిక భావోద్వేగానికి లోనయ్యింది. ప్రస్తుతం కేతిక మాట్లాడినటువంటి మాటలు నెట్టింట వైరల్‌గా మారాయి.
Read More: ఇలాంటి వ్యక్తినే పెళ్లి చేసుకోండి.. వివాహంపై సమంత పోస్ట్ వైరల్