విడాకులపై క్లారిటీ ఇస్తూ వీడియో రిలీజ్ చేసిన Yadama Raju దంపతులు

by Hamsa |   ( Updated:2023-07-04 07:53:04.0  )
విడాకులపై క్లారిటీ ఇస్తూ వీడియో రిలీజ్ చేసిన Yadama Raju దంపతులు
X

దిశ, వెబ్ డెస్క్: బుల్లితెర నటుడు యాదమ్మ రాజు గురించి ప్రత్మేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు. పటాస్ కామెడీ షొతో ఎంట్రీ ఇచ్చి ప్రేక్షకుల్లో క్రేజ్ తెచ్చుకున్నాడు. ఆ తర్వాత పలు షోలతో అలరిస్తూ పలు సినిమాల్లోనూ నటిస్తూ తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నాడు. గతేడాది తన ప్రియురాలు షార్లి స్టెల్లాను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అయితే వీరిద్దరూ తమ యూట్యూబ్ ఛానెల్‌లో వీడియోలు చేస్తూ సందడి చేస్తుంటారు. అయితే ఇటీవలే ఓ టీవీ షో పాల్గొన్న ఈ జంట విడాకులు తీసుకుంటున్నట్లు చెప్పడంతో అందరూ షాక్ అయ్యారు. దీంతో వీరిద్దరూ విడాకులు తీసుకుంటున్నారనే వార్తలు జోరందుకున్నాయి. తాజాగా, యాదమ్మ రాజు దంపతులు వీడాకుల వార్తలపై క్లారిటీ ఇస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియోను విడుదల చేశారు. ‘‘హలో ఫ్రెండ్స్ మేము శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో థీమ్ కోసం ‘డైవర్స్ ఫ్రాంక్’ అనే కాన్సెప్ట్‌లో భాగంగా అలా చేశాము. అంతేకానీ మేము విడాకులు తీసుకోవట్లేదు. దయచేసి ఈ వార్తలను ఎవరూ నమ్మొద్దు. ఉదయం నుంచి చాలామంది కాల్ కూడా చేశారు. క్లారిటీ కోసమే ఈ వీడియో చేస్తున్నాం. మేము చాలా సంతోషంగా ఉన్నాము. హ్యపీగా నీతోనే డ్యాన్స్ షో కోసం డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నాము. మేము రూమర్స్‌ను పట్టించుకోము. కానీ, ఆ రూమర్స్ వల్ల మా ఫ్యామిలీ, ఫ్రెండ్స్ ఇబ్బంది పడుతున్నారు. అందుకే మమ్మల్ని ప్రేమించే వారి కోసమే ఈ వీడియోను చేశాము’’ అంటూ చెప్పుకొచ్చారు.

Read More: రాజమౌళికి షాకిచ్చిన జూ.ఎన్టీఆర్, రామ్ చరణ్.. అసలేం జరిగింది!

Advertisement

Next Story

Most Viewed