ఆ టాలీవుడ్ స్టార్ హీరో పేరుతో.. గీతా మాధురి- నందు కొడుకు నామకరణం పోస్ట్ వైరల్

by Hamsa |
ఆ టాలీవుడ్ స్టార్ హీరో పేరుతో.. గీతా మాధురి- నందు కొడుకు నామకరణం పోస్ట్ వైరల్
X

దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ సింగర్ గీతా మాధురి- నందు దంపతుల గురించి పరిచయం అక్కర్లేదు. వీరిద్దరు 2014లో ప్రేమించి పెద్దలను ఒప్పించి మరీ పెళ్లి చేసుకున్నారు. అయితే వీరికి 2019లో ఓ పాప పుట్టింది. ఆ పాపకు దాక్షాయిని అని నామకరణం చేశారు. గీతా మాధురి అడపాదడపా పాటలు పాడుతూనే సోషల్ మీడియాలోనూ యాక్టీవ్‌గా ఉంటుంది. ఇక నందు వరుస చిత్రాల్లో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నాడు. ఇటీవల మళ్లీ ప్రెగ్నెంట్ అంటూ గీతా పలు పోస్టులు చేసింది.

అంతేకాకుండా స్రీమంతం ఫొటోలతో వార్తల్లో నిలిచింది. ఎట్టకేలకు ఆమెకు మగబిడ్డ పుట్టాడు. తాజాగా, తమ కొడుకు గీతామాధురి-నందు నామకరణం చేశారు. మార్చి 10వ తేదీన సినీ ప్రముఖుల సమక్షంలో ఆ బాబుకు ‘‘ధృవ ధీర్ తారక్’’ అనే పేరు పెట్టారు. ఈ విషయాన్ని తెలుపుతూ గీతా మాధురి తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ పెట్టింది. కానీ బాబు ఫేస్ మాత్రం రివీల్ చేయలేదు. ఇక అది చూసిన నెటిజన్లు మరోసారి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అంతేకాకుండా చివరకు ఎన్టీఆర్ పేరును యాడ్ చేయడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతూ పోస్ట్‌ను షేర్ చేస్తూ వైరల్ చేస్తున్నారు.

Read More..

సీక్రెట్‌గా అతడిని పెళ్లి చేసుకున్న బాలయ్య బ్యూటీ.. ఏకంగా నెల తర్వాత ఫొటోలు లీక్


Next Story