రేపే పవన్ కళ్యాణ్ పుట్టినరోజు..‘ఓజీ’ రిలీజ్ డేట్ ప్రకటిస్తారా?

by Jakkula Mamatha |
రేపే పవన్ కళ్యాణ్ పుట్టినరోజు..‘ఓజీ’ రిలీజ్ డేట్ ప్రకటిస్తారా?
X

దిశ,వెబ్‌డెస్క్:ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు రేపు (సెప్టెంబర్ 2న) ఘనంగా జరపడానికి అభిమానులు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా యువ దర్శకుడు సుజిత్ డైరెక్షన్‌లో ప్రేక్షుకుల ముందుకు రాబోతున్న మూవీ ‘ఓజీ’. ఈ హై వోల్టేజ్ యాక్షన్ మూవీ రిలీజ్ డేట్ ఇప్పటికే పలుమార్లు వాయిదా పడింది. పవన్ కల్యాణ్ ఓ పవర్ ఫుల్ గ్యాంగ్ స్టర్ గా కనిపించనున్న ఓజీ చిత్రం కోసం ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో ఈ సినిమా విడుదల తేదీ పలుమార్లు వాయిదా పడడంతో వారిలో నిరాశ నెలకొంది.

రేపు (సెప్టెంబర్ 2) పవన్ కల్యాణ్ పుట్టినరోజు కావడంతో, ఓజీ మేకర్స్ నుంచి ఏమైనా అప్‌డేట్ రాకపోతుందా? అని అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ దాదాపు పూర్తి అయినట్లే..కొంత భాగం మాత్రమే మిగిలుంది. ఏపీ డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కొన్ని డేట్స్ ఇస్తే చాలు ప్యాకప్ చెప్పేస్తామని మేకర్స్ అంటున్నారు. ఈ సినిమాలో పవన్ సరసన ప్రియాంక మోహన్ కథానాయికగా నటిస్తోంది. యువ నటుడు అర్జున్ దాస్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed