- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
900 కోట్లు ఇస్తేనే విడాకులు ఇస్తా.. భర్తకు షాక్ ఇచ్చిన స్టార్ హీరోయిన్
దిశ, సినిమా: ప్రస్తుతం కాలంలో సెలెబ్రిటీలకు విడాకులు చాలా కామన్ అయిపోయాయి. ఒకరితో మరొకరికి చిన్న చిన్న అభిప్రాయ భేదాలు రాగానే కలిసుండలేము అని డిసైడ్ అయ్యి డివోర్స్ వైపు పరుగులు పెడుతున్నారు. అయితే విడాకులు తీసుకునేటప్పుడు భర్త భార్యకు భరణం కింద ఎంతో కొంత మనీ ఇస్తాడు అనే విషయం తెలిసిందే. ఆ భరణం కింద ఎక్కువలో ఎక్కువ ఓ రెండు మూడు కోట్లు ఇచ్చి ఉంటారు. కానీ, ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన ఓ జంట విడాకులు తీసుకోవాలి అనుకుంటే.. ఆ నటి తన భర్తను భరణం కింద 900 కోట్లు అడిగిందట. అలా ఇస్తేనే విడాకులకు సై అంటూ మకాం వేసి కూర్చున్నదట. మరి ఇంతకీ ఎవరా మహానుభావురాలు అనేది ఇప్పుడు చూసేద్దాం..
వరల్డ్ ఫేమస్ పాప్ సింగర్.. హాలీవుడ్ స్టార్ జెన్నిఫర్ లోపేజ్ అందరికీ సుపరిచితమే. ఈమెకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రేజ్ గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. ఆమె పాటలంటే చాలా మందికి పిచ్చి.. జెన్ని షోకు లక్షల్లో ఆడియన్స్ వస్తుంటారు. అయితే ఈమె తన జీవితంలో 5 సారి విడాకులు ఇవ్వడానికి రెడీ అవుతోంది. అంతే కాదండోయ్ ఇక్కడ విశేషం ఏంటంటే... ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన విడాకుల వ్యవహారంగా వీరిది నమోదు కాబోతోంది.
హాలీవుడ్ సమాచారం ప్రకారం.. జెన్నిఫర్ లోపేజ్, బెన్ అఫ్లెక్ జంట విడాకులు తీసుకోవాలని అనుకుంటున్నారట. ప్రస్తుతం ఇద్దరి లాయర్ల మధ్య విడాకులు చర్చలు జరుగుతన్నాయట. ఇద్దరి మధ్య అవగాహన కుదిరితే డివోర్స్ కు రెడీ అయినట్టే అంటున్నారు. అయితే జెన్నిఫర్ తన భర్త బెన్ నుంచి విడాకులు తీసుకోవడానికి అతడి ఆస్తిలో సగం వాటా అడుగుతున్నదనే ప్రచారం జరుగుతున్నది. బెన్ ఆస్తి మొత్తం 1800 కోట్లు ఉంటే అందులో నుంచి సగం అంటే 900 కోట్ల భరణం జెన్నిఫర్ కోరుతుంది. మరి వీరి వ్యవహారం ఎంత వరకు సాగుతుందో చూడాలి.
కాగా జెన్నీఫర్ లోపేజ్‌కు ఆస్తి తక్కువేమి లేదు. ఆమె ఆస్తి విలువ దాదాపుగా 500 మిలియన్ డాలర్లు ఉండవచ్చనే అంచనాలున్నాయి. అంటే ఇండియన్ కరెన్సీలో లెక్క వేస్తే దాదాపు 4000 కోట్ల ఆస్తి ఆమె సొంతం అని తెలుస్తోంది.