IIFA అవార్డు ఈవెంట్‌లో హోస్ట్‌గా సందడి చేయనున్న బాలనటుడు?

by Jakkula Samataha |
IIFA అవార్డు ఈవెంట్‌లో హోస్ట్‌గా సందడి చేయనున్న బాలనటుడు?
X

దిశ, సినిమా : బాల నటుడిగా తెలుగు వెండితెరకు పరిచయమైన నటుడు తేజా సజ్జ. చిన్నప్పటి నుంచే తన నటనతో ఎంతో మందిని ఆకట్టుకున్న ఈ హీరో హనుమాన్ సినిమాతో పాన్ ఇండియా లెవెల్‌ల్లో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. దీంతో ఈ యువ నటుడి క్రేజ్ అమాంతం పెరిగిపోయింది.

తాజాగా తేజా సజ్జకు సంబంధించిన ఓ ఇంట్రస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అయితే ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ ఈ ఏడాది అవార్డుల వేడుకను నిర్వహించేందుకు రెడీ అయిపోయింది. ఈ క్రమంలో ఈ ఈవెంట్‌కు హోస్ట్‌గా చేయడానికి హీరో తేజా సజ్జను సంప్రదించినట్లు తెలుస్తోంది. ఎందుకంటే? ఈ హీరోకు చిన్నప్పటి నుంచి స్టార్, సూపర్ స్టార్ హీరోలతో మంచి సంబంధం ఉంది. ఇది అతను హోస్ట్ చేయడానికి చాలా ఉపయోగపడుతుంది. అందుకోసమే ఈ వేడుకకు తేజాను హోస్ట్‌గా చేయడానికి IIFA ఒప్పించినట్లు సమాచారం. దీనికి తేజా కూడా ఒప్పుకున్నట్లు సమాచారం. ఇక ఈ అవార్డు వేదికపై ఇప్పటికీ దగ్గుబాటి రానా, సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్ వంటి ఎంతో మంది అగ్రహీరోలు సందడి చేశారు. కాగా,ఈ సారి ఈ నవ యువ హీరోకి ఈ వేదిక ఎలాంటి పాపులారిటీ తీసుకొస్తుందో అని తన అభిమానులు ఆశగా ఎదురు చూస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed