- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
మనోజ్‌ను వదిలేసిన మోహన్ బాబు.. విష్ణుతో కలిసి ఎక్కడికి వెళ్తున్నాడు?
దిశ, వెబ్‌డెస్క్ : భూమా మౌనికను, మంచు మనోజ్ ప్రేమ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. వీరి పెళ్లి జరిగినప్పటి నుంచి మంచు ఫ్యామిలీకి చెందిన ఏదో ఒక రూమర్ సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. మంచు బ్రదర్స్ మధ్య గొడవలు జరుగుతున్నాయంటూ ఎన్నో వార్తలు వచ్చాయి. కాగా, ఎట్టకేలకు వాటిని నిజం చేస్తూ, ఇటీవల మనోజ్, విష్ణు వచ్చి ఇలా కొడుతాడంటూ ఓ విడియో విడుదల చేసిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి విష్ణు,మనోజ్‌కు మధ్య చాలానే గొడవలు జరుగుతున్నాయంటూ రకరకాల రూమర్స్ వైరల్ అవుతున్నాయి.
ఈ నేపథ్యంలో తాజాగా, మంచు మోహన్ బాబు, విష్ణుతో కలిసి ఫ్లైట్‌లో ప్రయాణం చేస్తున్న వీడియో ఒకటి వైరల్‌గా మారింది. అందులో విష్ణు నాన్నా, ఒక సారి ఇలా చూడు అంటూ వీడియో తీయగా, మోహన్ బాబు నవ్వుతూ వీడియో వైపు చూశాడు. అయితే ఇది చూసిన కొందరు షాకింగ్ కామెంట్స్ చేస్తున్నారు. మోహన్ బాబు మనోజ్‌ను వదిలేశాడు. విష్ణుకే ప్రియారిటీ ఇస్తున్నాడు. అసలు వీరిద్దరు ఎక్కడికి వెళ్తున్నారంటూ గుసగుసలాడుతున్నారు. ఈ వీడియోను విష్ణు తన ఇన్ స్టాలో స్టోరిగా పెట్టుకున్నాడు.