- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
18 Pages: నిఖిల్ '18 పేజెస్' ఓపెన్ ఎప్పుడో..
దిశ, సినిమా: కొన్ని సినిమాలు షూటింగ్స్ అంతా పూర్తి చేసుకునప్పటికీ విడుదలకు మాత్రం బోలెడు సమయం తీసుకుంటాయి. ఇందులో ఒకటి 18 పేజెస్(18 pages). నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ లవ్లీ కాంబినేషన్‌లో గీతా ఆర్ట్స్ 2 బ్యానర్‌లో తెరకెక్కిన ఈ మూవీకి సుకుమార్ రచనలు, ప్రేమ కథ చిత్రమ్ లాంటి సక్సెస్ ఫుల్ మూవీ అందించిన సూర్య ప్రతాప్ దీనికి డైరెక్షన్ చేశారు. సంగీతాన్ని గోపీసుందర్ సమకూర్చారు. ఇంత మంచి బ్యాగ్రౌండ్ ఉన్నప్పటికీ రిలీజ్ మాత్రం ఆగిపోయింది. ఈ మూవీ తర్వాత ఆలస్యంగా మొదలైన కార్తికేయ-2 జూలైలో విడుదలకు సిద్ధమైంది. ఈ సినిమా పోస్టర్, టీజర్, పాత్రల పరిచయాలు అన్నీ కూడా చూశాం. తనకు బాగా పేరు తెచ్చిన కార్తికేయ సినిమాకు సీక్వెల్ కావడంతో నిఖిల్ దీనిపై చాలా హోప్స్ పెట్టుకున్నాడు. కథ నచ్చితే తప్ప ఇతర భాషల్లో నటించేందుకు ఒప్పుకొని బాలీవుడ్ లెజెండరీ యాక్టర్స్ అనుపమ్ ఖేర్ ఇందులో ఒక కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఆయన ఒప్పుకున్న తెలుగు స్ట్రెయిట్ సినిమా ఇదొక్కటే. మరి 18 పేజెస్ అప్ డేట్ ఎప్పుడు వస్తుందో తెలియక నిఖిల్ అభిమానులు నిరాశ చెందుతున్నారు.