బాస్ మాట్లాడుతుంటే కన్నీళ్లు వచ్చేశాయి.. Sai Rajesh ఎమోషనల్ పోస్ట్

by Hamsa |   ( Updated:2023-07-29 03:30:50.0  )
బాస్ మాట్లాడుతుంటే కన్నీళ్లు వచ్చేశాయి.. Sai Rajesh ఎమోషనల్ పోస్ట్
X

దిశ, వెబ్ డెస్క్: ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య కలిసి నటించిన చిత్రం ‘బేబీ’. దీనికి సాయి రాజేష్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా జూలై 14న విడుదలై భారీ విజయాన్ని అందుకుంది. విడుదలై మూడు వారాలు అవుతున్నా థియేటర్లు ప్రేక్షకులతో కళకళలాడిపోతున్నాయి. ఇప్పటికే ఈ చిత్రంపై పలువురు సినీ ప్రముఖులు ప్రశంసలు కురిపించిన విషయం తెలిసిందే.

తాజాగా, మెగాస్టార్ చిరంజీవి బేబీ దర్శకనిర్మాతలను ఇంటికి పిలిపించి మరీ అభినందించారు. ఈ విషయాన్ని డైరెక్టర్ సాయి రాజేష్ తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా తెలియజేస్తూ భావోద్వేగానికి గురయ్యారు. ‘‘ నా కల నిజమైన వేళ. నా దేవుడితో రెండు గంటలు ఉన్నాను. ఆయనకు బేబీ నచ్చింది. ప్రతి విభాగాన్ని మెచ్చుకున్నారు. ఇది నాకు జీవితాంతం గుర్తుండిపోయే క్షణం. రెండు గంటలు బాబాయ్ రెండు గంటలు. బాస్ మాట్లాడుతుంటే కన్నీళ్లు వచ్చేశాయి’’ అంటూ రాసుకొచ్చారు. ఇటీవల అల్లు అర్జున్ కోసం పెట్టినట్లు.. ఇప్పుడు చిరంజీవి కోసం స్పెషల్‌గా మరో ఈవెంట్ పెట్టబోతున్నట్లు వెల్లడించారు.

Also Read: ‘BRO’ సినిమాలో ఏపీ సీఎంను టార్గెట్ చేసిన Pawan Kalyan..! వైరల్ అవుతున్న మూవీ క్లిప్స్..

Advertisement
Next Story

Most Viewed