- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Amala: వాట్.. నాగార్జున కంటే ముందు అమల ఆ హీరోతో ప్రేమలో పడిందా? ఇన్నాళ్లకు బయటపడ్డ అసలు నిజం
దిశ, సినిమా: అక్కినేని వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన నాగార్జున.. ఎన్నో సూపర్ హిట్ సినిమాలను ప్రేక్షకులకు అందించి మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. 64 ఏళ్ల వయస్సులోనూ మూవీలు చేస్తూ యంగ్ హీరోలకు గట్టి పోటీ ఇస్తున్నాడు. అంతేకాకుండా ఇప్పటికీ అమ్మాయిల మనసులో నవ మన్మధుడుగా మంచి ఫాలోయింగ్ క్రియేట్ చేసుకున్నాడు. అలాగే ఫ్యామిలీ సినిమాల్లో నటించి మహిళల్లో మంచి క్రేజ్‌ను సంపాదించుకున్నారు.
అయితే దగ్గుబాటి రామానాయుడు కూతురు లక్ష్మితో 1984లో నాగార్జున వివాహం జరిగిన విషయం తెలిసిందే. ఇక 1986లో వీరికి నాగ చైతన్య జన్మించాడు. అయితే లక్ష్మితో పెళ్లి నాగార్జునకు ఫస్ట్ నుంచి ఇష్టం లేకపోవడంతో వీరిద్దరు కొన్నాళ్లకు వీడిపోయారు. ఆ తర్వాత శివ, నిర్ణయం, చినబాబు, ప్రేమ యుద్ధం, కిరాయి దాదా వంటి సినిమాల్లో హీరోయిన్‌గా నటించిన అమలతో మరోసారి ప్రేమలో పడటంతో నాగార్జున ఆమెను రెండో వివాహం చేసుకున్నారు. అయితే అమల నాగార్జున కంటే ముందు తమిళ హీరో కార్తీక్‌తో ప్రేమలో పడ్డారనే వార్త ఇప్పుడు వైరల్ అవుతోంది.
హీరో కార్తీక్, అమల ఇద్దరు కలిసి 'ఘర్షణ' అనే మూవీలో కలిసి నటించారు. ఆ సినిమా షూటింగ్‌లో ఏర్పడిన పరిచియం ప్రేమగా మారిందని తెలుస్తోంది. అయితే వీరిద్దరి మధ్య ఉన్న ప్రేమాయణం ఎక్కువ మందికి తెలియదట. కేవలం అమల, కార్తీక్, దగ్గరి సన్నిహితులకు మాత్రమే తెలుసట. అయితే ఏం జరిగిందో తెలియదు కానీ వీరిద్దరూ విడిపోయారు. ఆ తర్వాత అమల తమిళ ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పి.. తెలుగు ఇండస్ట్రీకి వచ్చేశారు. అలా అప్పటి యువ హీరో నాగార్జునతో ప్రేమలో పడి ఆయన్ని వివాహం చేసుకున్నారు. అయితే ఇందులో ఎంతవరకు వాస్తవం ఎంతో ఉందో తెలియనప్పటికీ ఈ వార్త నెట్టింట చక్కర్లు కొడుతుంది.