పవన్ కల్యాణ్‌‌ను మనమంతా కలిసి గెలిపించాలి: బ్రహ్మానందం

by Anjali |   ( Updated:2023-07-26 15:04:38.0  )
పవన్ కల్యాణ్‌‌ను మనమంతా కలిసి గెలిపించాలి: బ్రహ్మానందం
X

దిశ, వెబ్‌డెస్క్: పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ అటు సినిమాలో ఇటు రాజకీయాల్లో ఫుల్ బిజీగా గడిపేస్తున్నారు. ప్రస్తుతం ఈయన ‘బ్రో’ చిత్రంలో అల్లుడు సాయిధరమ్ తేజ్‌తో కలిసి నటిస్తోన్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ సందర్భంగా టాలీవుడ్ స్టార్ కమెడియన్ బ్రహ్మానందం మాట్లాడుతూ.. ‘‘పవన్‌ను నేను 20 ఏళ్ల నుంచి చూస్తున్నాను. చాలా మంచి వ్యక్తి. ఆయన మాటల్లో, నవ్వులో ఎలాంటి కల్మషం ఉండదు. కావాలనుకునే వారికి ఇష్టమైన అవతారంలో కనిపించే దేవాంష సంభూతుడు పవన్ కల్యాణ్. మీరంతా చప్పట్లు కొట్టడం కాదు. మనమంతా కలిసి పవర్ స్టార్‌ను గెలిపించాలి.’’ అంటూ బ్రహ్మానందం చెప్పుకొచ్చారు. ఈ కమెడియన్.. పవన్ గెలుపు కోరుకోవడంతో మెగా ఫ్యాన్స్, అటు జనసైనికులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. మా అన్నకు మీలాంటి పెద్దల సపోర్ట్ ఉంటే కచ్చితంగా గెలుస్తాని పవన్ అభిమానులు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ప్రస్తుతం ఇది ఇండస్ట్రీలో హాట్ టాపిగ్‌గా మారింది.

Read More: పవర్ స్టార్ ఫ్యాన్స్‌కు పండగే.. ‘బ్రో’ మూవీలో హిట్ సాంగ్ రిపీట్: వీడియో

Advertisement

Next Story