మేము రికార్డుల కోసం సినిమా తీయలేదు.. కల్కి సినిమాపై నిర్మాత సంచలన పోస్ట్

by Kavitha |
మేము రికార్డుల కోసం సినిమా తీయలేదు.. కల్కి సినిమాపై నిర్మాత సంచలన పోస్ట్
X

దిశ, సినిమా: ‘ కల్కి 2898AD’ సినిమా థియేటర్స్ లో హిట్ టాక్ తో సందడి చేస్తుంది. సినిమాలోని విజువల్స్, యాక్షన్ సీన్స్, మహాభారతం సీన్స్ అన్ని చూసి ప్రేక్షకులు ఆశ్చర్యపోతూ డైరెక్టర్ నాగ్ అశ్విన్‌ని పొగిడేస్తున్నారు. ఇక మొదటి రోజు అయిందంటే ఏ సినిమా అయినా కలెక్షన్స్ గురించే మాట్లాడతారు. అందులో ప్రభాస్ సినిమా అయితే ఎన్ని కోట్లు కలెక్ట్ చేసింది, ఎన్ని రికార్డులను సెట్ చేసిందనే మాట్లాడతారు. కల్కి సినిమా మొదటి రోజు 180 కోట్లకు పైగా కలెక్ట్ చేసిందని బాక్సాఫీస్ సమాచారం. ఇప్పటికే పలు చోట్ల కలెక్షన్ల విషయంలో సరికొత్త రికార్డు సెట్ చేసింది కల్కి. అయితే కల్కి కలెక్షన్స్ అధికారికంగా మూవీ యూనిట్ పోస్ట్ చేయలేదు. దీంతో పలువురు నిర్మాతలను కలెక్షన్స్ గురించి అడుగుతున్నట్టు సమాచారం. దీనిపై నిర్మాత స్వప్న దత్ స్పందిస్తూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది.

స్వప్న దత్ తన పోస్ట్ లో.. నాకు ఆశ్చర్యంగా ఉంది. చాలామంది నాకు కాల్ చేసి రికార్డ్స్ క్రాస్ చేశామా లేదా అని అడుగుతున్నారు. నాకు నవ్వొస్తుంది. ఎందుకంటే ఆ రికార్డులు సృష్టించిన వాళ్ళెవరూ ఆ రికార్డుల కోసం సినిమాలు తీయరు. ప్రేక్షకుల కోసం, సినిమా మీద ప్రేమతో సినిమాలు తీస్తారు. మేము కూడా అలాగే తీసాం అని పోస్ట్ చేసింది. దీంతో ఈ పోస్ట్ వైరల్ గా మారింది.

కాగా వైజయంతి మూవీస్ బ్యానర్లో అశ్వినీదత్ ఆధ్వర్యంలో ఆయన ఇద్దరు కూతుళ్లు ప్రియాంక దత్, స్వప్న దత్ ఈ మూవీని నిర్మించారు.




Next Story