అపరిచితుడు సినిమా తీయడానికి న్యూస్ పేపరే కారణమా?

by samatah |   ( Updated:2023-04-05 09:12:20.0  )
అపరిచితుడు సినిమా తీయడానికి న్యూస్ పేపరే కారణమా?
X

దిశ, వెబ్‌డెస్క్ : శంకర్ దర్శకత్వంలో వచ్చిన అపరిచితుడు మూవీని ఇప్పటికీ ఎవరూ మర్చిపోరు. ఎన్ని సినిమాలు వచ్చినా.. దీనికి ఉండే ప్రత్యేకత ఈ సినిమాకే ఉంటుంది. ఇక ఈ మూవీలో విక్రమ్, ప్రకాశ్ రాజ్ నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇండియా గర్వించదగ్గ సినిమాలలో ఇది ఒకటి. అయితే ఈ మూవీకి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. అయితే ఈ మూవీ ఓ న్యూస్ పేపర్‌లో వచ్చిన ఘటనతో తీశారంట. అది ఎలా అంటే?

దర్శకుడు శంకర్‌కు ఎక్కువగా న్యూస్ పేపర్ చదివే అలవాటు ఉందంట. ప్రతి రోజూ క్రమం తప్పకుండా పేపర్ చువుతాడంట. అయితే ఒకరోజు న్యూస్ పేపర్‌లో వచ్చిన వార్తను చూసి శంకర్ ఆకర్షితుడు అయ్యాడంట.మధురైలో జరిగిన ఓ సంఘటన కరుడుగట్టిన ఒక నేరస్తుడిని ఎలాగైనా పట్టుకోవాలని ఉద్దేశంతో.. ఒక పోలీస్ ఆఫీసర్ అండర్ కవర్ ఆపరేషన్ చేసి ఏకంగా 40 రోజులపాటు భిక్షాటన చేస్తూ ప్రత్యేక అండర్ కవర్ ఆపరేషన్ చేశారు. అలా భిక్షాటన చేస్తూ, మాటు వేసి ఆ నేరస్తుడిని పట్టుకున్నారు. ఈ వార్తను శంకర్ సినిమాగా మలచాలని భావించారు. అందుకోసం సిక్రిప్ట్ తయారు చేయించి.. ఆసంఘటనే సినిమాగా మలిచాడంట. దీంతో ఈమూవీ దేశవ్యాప్తంగా మంచి పేరు సంపాదించింది.

Read more:

War 2: ‘వార్ 2’ లో హృతిక్‌తో పోటీకి దిగుతున్న ఎన్టీఆర్

Advertisement

Next Story