Sridevi పెళ్లికి ముందే Janhvi Kapoor పుట్టిందా? షాకింగ్ విషయాలు బయటపెట్టిన Boney Kapoor

by Anjali |   ( Updated:2023-10-03 15:19:39.0  )
Sridevi పెళ్లికి ముందే Janhvi Kapoor పుట్టిందా? షాకింగ్ విషయాలు బయటపెట్టిన Boney Kapoor
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ అందాల తార శ్రీదేవి గురించి సుపరిచితమే. ఈ భామ చనిపోయి ఇన్నాళ్లైన.. ఆమెపై ప్రేమ, అభిమానం ప్రేక్షకుల్లో అలాగే ఉంది. శ్రీదేవి నటన, డాన్స్ గురించైతే ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. ఇకపోతే శ్రీదేవి భర్త తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరై.. ‘‘శ్రీదేవి నేను సీక్రెట్‌గా 1996 షిర్డిలో పెళ్లి చేసుకున్నాం. కొన్ని నెలల తర్వాత మా పెళ్లి విషయాన్ని మీడియా ముందు తెలిపాం. మళ్లీ 1997లో మళ్లీ కుటుంబసభ్యుల సమక్షంలో వివాహం చేసుకున్నాం. నా పెద్ద కుమార్తె జాన్వీ 1997 మార్చిలో జన్మించింది. మా పెళ్లికి ముందే పుట్టిందని సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేశారు. అవి ఇప్పటికి వినిపిస్తున్నాయి. నేను జాన్వీ పుట్టిన రోజు గురించి ఎన్ని సార్లు చెప్పినా ప్రచారం మాత్రం ఆగడం లేదు.’’ అంటూ బోనీ కపూర్ వెల్లడించారు.

Advertisement

Next Story

Most Viewed