- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఇడియట్స్ హిందూ సంప్రదాయాలపైనే ప్రయోగాలు చేస్తారు.. స్టార్ డైరెక్టర్
దిశ, ఫీచర్స్ : బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్, కియారా నటించిన 'ఏయూ బ్యాంక్' యాడ్‌పై భారీ ఎత్తున విమర్శలు వస్తున్న విషయం తెలిసిందే. కాగా ఈ ప్రకటనపై సెన్సేషనల్ డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి తనదైన స్టైల్‌లో రియాక్ట్ అయ్యాడు. 'సామాజిక, మతపరమైన సంప్రదాయాలను మార్చడానికి బ్యాంకులు ఎప్పటి నుంచి బాధ్యత వహిస్తున్నాయి. ఈ విషయం నాకు అర్థం కావడం లేదు? ఇలాంటి పనికిమాలిన పనులను, మార్పులను హిందువు సంప్రదాయాల్లోనే చేస్తారు. ఇడియట్స్' అంటూ ట్వీట్ చేస్తూ మండిపడ్డాడు.
ఇక ఇందులో కొత్తగా పెళ్లైన వధువు కియారా, వరుడిగా ఆమీర్ నటించగా హిందూ సంప్రదాయంలో ఆ వధూవరులని ఇంట్లోకి ఆహ్వానిస్తుంటారు కుటుంబ సభ్యులు. అది చూసి ఎవరు ముందు వెళ్లాలని ఆమీర్ అడుగుతాడు. దానికి ఎవరు ఇంటికి కొత్తగా వస్తే వారే అని కియారా చెబుతుంది. దీంతో ఆమీర్ ముందుగా ఇంట్లోకి అడుగుపెట్టడంతో హిందూ సంప్రదాయాన్ని కించపరిచారంటూ కోపంతో ఊగిపోతున్న నెటిజన్లు 'ఆ బ్యాంకుని బాయ్‌కాట్ చేయాలి' అంటూ నెట్టింట రచ్చ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది.