రోహిణి ప్రేమలో పడ్డ విలన్ అర్జున్ దాస్?

by Mahesh |   ( Updated:2023-10-10 16:34:40.0  )
రోహిణి ప్రేమలో పడ్డ విలన్ అర్జున్ దాస్?
X

దిశ, సినిమా: తెలుగు కామెడీ షో 'జబర్దస్త్' తో పాటుగా 'శ్రీ దేవి డ్రామా కంపెనీ' షో కూడా మంచి ఫామ్‌లో దూసుకుపోతుంది. తాజాగా న్యూ ఎపిసోడ్‌కి సంబంధించిన ప్రోమో విడుదలైంది. జనవరి 29న ప్రసారం అయ్యే ఈ ఎపిసోడ్‌లో ఒక సర్‌ప్రైజ్ ఉంది. ఈ ఎపిసోడ్‌కు 'బుట్ట బొమ్మ' చిత్ర యూనిట్, కార్తీ ఖైదీ, అర్జున్ దాస్, హీరోయిన్ అనికా సురేంద్రన్ హాజరయ్యారు. దీంతో ప్రోగ్రామ్‌లో ఎంటర్‌టైన్‌మెంట్ మరింత పెరిగిపోయింది. అయితే ప్రోమోలో అర్జున్ దాస్ మ్యూజికల్ చైర్ గేమ్‌లో పాల్గొన్నాడు. ఇందులో భాగంగా అర్జున్ దాస్ బుల్లితెర నటి నవ్య స్వామిని ఎత్తుకుని గేమ్ ఆడాడు.

ఆమెను ఎత్తుకున్నప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? అని రాంప్రసాద్ అడగగా.. అర్జున్ దాస్ గుడ్ వర్కౌంట్ అని బదులిచ్చాడు. తర్వాత రోహిణి ని చూపించి ఎత్తుకొమని అంటారు. అప్పుడు ఆమెని చూడగానే భయంతో అర్జున్ దాస్, ఒక ఛాలెంజ్‌గా తీసుకున్న రోహిణిని ఎత్తుకుని కుర్చీల చుట్టూ తిరుగుతాడు. ఇక వెంటనే యాంకర్ రష్మీ వచ్చి.. 'నిన్ను మోసాడు.. రేపు నీ బాధ్యత కూడా మొస్తాడు' అని అంటుంది. దీంతో రోహిణి, అర్జున్ దాస్‌ను ప్రేమగా చూస్తూ రొమాంటిక్‌గా అతని చేయి పట్టుకుంటుంది.

Advertisement

Next Story

Most Viewed