Vikrant Messi: మా అమ్మ సలహాతోనే సహజీవనంలో ఉన్నాం.. యంగ్ నటుడు షాకింగ్ కామెంట్స్

by sudharani |
Vikrant Messi: మా అమ్మ సలహాతోనే సహజీవనంలో ఉన్నాం.. యంగ్ నటుడు షాకింగ్ కామెంట్స్
X

దిశ, సినిమా: యంగ్ నటుడు విక్రాంత్ మెస్సీ గురించి తెలిసిందే. ‘12th ఫెయిల్’ సినిమాతో బాలీవుడ్‌లోనే కాకుండా దక్షిణాదిలోనూ మంచి క్రేజ్ తెచ్చుకున్న ఈయన.. ప్రజెంట్ ‘ఫిర్ ఆయీ హసీనా దిల్‌రుబా’ చిత్రంతో బిజీగా ఉన్నాడు. జయప్రద్ దేశాయ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో విక్రాంత్ మెస్సీతో పాటు తాప్సీ, సన్నీ కౌశల్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. రొమాంటిక్ థ్రిల్లర్ బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కిన ఈ చిత్రం 2021లో విడుదలైన ‘హసీనా దిల్‌రుబా’కు సీక్వెల్‌గా రాబోతుంది. ఇప్పుడు ఈ మూవీ ఆగస్టు 9నుంచి నెట్‌ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. ఇక రిలీజ్ సమయం దగ్గరపడటంతో ప్రమోషన్స్‌లో జోరు పెంచారు చిత్రం బ‌ృందం. ఈ క్రమంలోనే తాజాగా ఇంటర్వ్యూలో పాల్గొన్న విక్రాంత్ సినిమా విషయాలతో పాటు పర్సనల్స్ కూడా షేర్ చేసుకున్నాడు.

ఇందులో భాగంగా తన భార్య శీతల్ ఠాకూర్ గురించి మాట్లాడుతూ.. ‘ఓ కామన్ ఫ్రెండ్ ద్వారా శీతల్ నాకు పరిచయమైంది. ఫస్ట్ చూపులోనే మేము ప్రేమలో పడలేదు. చాలా కాలం మంచి ఫ్రెండ్స్‌గా ఉన్నాము. తర్వాత శీతల్ నా భార్య ఎందుకు కాకూడదు అనిపించింది. అప్పుడే మా జర్నీ స్టార్ట్ అయింది. దాదాపు 10ఏళ్ల నుంచి మేము ఇద్దరం కలిసున్నాం. పెళ్లికి ముందు ఎనిమిదేళ్లు లివింగ్ రిలేషన్‌లో ఉన్నాం. అన్ని సంవత్సరాలు డేటింగ్‌లో ఉండటం అందరికీ వర్కౌట్ అవుతుందో లేదో నాకు తెలియదు కానీ.. మాకు మాత్రం బాగా కలిసి వచ్చింది. మా బంధాన్ని మరింత బలోపేతం చేసింది. అమ్మ ఇచ్చిన సలహా మేరకే మేము పెళ్లికి ముందు సహజీవనం చేశాం. అది నిజంగా చాలా ఉపయోగపడింది. మా మధ్య ఉన్న చిన్న చిన్న సమస్యలను పరిష్కరించుకున్నాం. ఇప్పుడు ఎంతో సంతోషంగా జీవిస్తున్నాం’ అంటూ చెప్పుకొచ్చాడు.

Advertisement

Next Story