Vijay Thalapathy: విజయ్ ‘గోట్’ ట్రైలర్ డేట్ వచ్చేసింది.. రిలీజ్ ఎప్పుడంటే?

by Prasanna |   ( Updated:2024-08-15 15:43:32.0  )
Vijay Thalapathy:  విజయ్ ‘గోట్’ ట్రైలర్ డేట్ వచ్చేసింది.. రిలీజ్ ఎప్పుడంటే?
X

దిశ, సినిమా : తమిళ స్టార్ తలపతి విజయ్ కు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఫ్యాన్స్ భారీగా ఉన్నారు. ఇక తాజగా ఈ హీరో నటించిన సినిమ ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్’. ఈ మూవీ పై ఫ్యాన్స్ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఈ మూవీకి వెంకట్ ప్రభు డైరెక్షన్ చేయగా మీనాక్షి చౌదరీ, స్నేహ హీరోయిన్లు గా నటిస్తున్నారు. సైన్స్ ఫిక్షన్ బ్యాక్ డ్రాప్ తో రూపొందిన ఈ మూవీ నుంచి ఇప్పటికే రిలీజ్ అయినా ఫస్ట్ లుక్, పోస్టర్స్‌, పాటలు ప్రేక్షకుల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది.

ఇక తాజాగా చిత్ర బృందం ట్రైలర్ గురించి ఓ అప్డేట్ ఇచ్చారు. ‘గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం’ మూవీ ట్రైలర్ ను ఆగస్టు 17న రిలీజ్ చేయనున్నారు. ఈ విషయాన్ని మూవీ మేకర్స్ అధికారికంగా వెల్లడించారు. అయితే, ఈ నెల 17 న సాయంత్రం 5 గంటలకు ‘గోట్‌’ ట్రైలర్ ను రిలీజ్ చేయనున్నారు.

మూవీ మేకర్స్ విడుదల చేసిన పోస్టర్ లో విజయ్ స్టైలిష్ లుక్ లో కనిపించి సినిమా పై ఆసక్తిని పెంచుతున్నారు. విజయ్ డ్యూయెల్ రోల్ లో కనిపించనున్నారు. ఏజీఎస్‌ ఎంటర్‌టైన్ మెంట్‌ పతాకం పై రూపొందుతున్న ఈ మూవీ సెప్టెంబర్ లో ఆడియెన్స్ ముందుకు రానుంది.

Advertisement

Next Story