నందమూరి హీరో సినిమా.. అలాంటి పాత్రలో కనిపించబోతున్న విజయశాంతి

by Prasanna |   ( Updated:2023-10-21 11:20:17.0  )
నందమూరి హీరో సినిమా.. అలాంటి పాత్రలో కనిపించబోతున్న విజయశాంతి
X

దిశ, సినిమా: ఈ మధ్యకాలంలో సీనియర్ హీరోయిన్‌లు సెకండ్ ఇన్నింగ్స్‌లో దూసుకుపోతున్నారు. ఒకప్పుడు స్టార్ హీరోయిన్‌గా చక్రం తిప్పిన వారిలో విజయశాంతి ఒకరు. దాదాపు అందరు హీరోలతో జతకట్టి తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక మహేష్ బాబు నటించిన ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాతో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన విజయశాంతి.. ఇప్పుడు మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దాదాపు మూడేళ్ల తర్వాత కొత్త సినిమాకు సైన్ చేసింది. శుక్రవారం ఈ సినిమా పూజా కార్యక్రమాలతో అట్టహాసంగా ప్రారంభమైంది. అశోక క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లపై భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ చిత్రంలో హీరోగా కల్యాణ్ రామ్ నటిస్తుండగా, సాయి మంజ్రేకర్ హీరోయిన్‌గా కనిపించనుంది. ప్రదీప్ చిలుకూరి దర్శకత్వం వహిస్తున్న మూవీలో విజయశాంతి పోలీస్‌గా కనిపించబోతున్నట్లు సమాచారం.

Advertisement

Next Story