Leo first-look poster released : విజయ్ దళపతి బర్త్ డే స్పెషల్

by Hamsa |   ( Updated:2023-06-22 05:31:36.0  )
Leo first-look poster released : విజయ్ దళపతి బర్త్ డే స్పెషల్
X

దిశ, వెబ్ డెస్క్: నేడు తమిళ స్టార్ హీరో విజయ్ దళపతి పుట్టిన రోజు 22 జూన్ 1974. విజయ్‌కు తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం చేయాల్సిన పని లేదు. పలు చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు దక్కించుకున్నాడు. ప్రస్తుతం విజయ్, దర్శకుడు కనగరాజ్ డైరెక్షన్‌లో లియో చిత్రంలో నటిస్తున్నాడు. తాజాగా, నేడు విజయ్ బర్త్ డే విషెస్ తెలుపుతూ లోకేష్ కనగరాజ్ ‘లియో’ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశాడు. అందులో విజయ్ ఫుల్ యాక్షన్ మోడ్ లో ఉన్నట్టు చూపించారు. వెనక మంచు కొండలు, ఓ తోడేలు, ఓ వ్యక్తి ఊడిన పళ్లు, చేతిలో సుత్తి, దానితో పాటు గాల్లో రక్తం చూస్తుంటే.. విలన్ గ్యాంగ్ మనుషులు విజయ్ పై దాడి చేయడానికి వస్తే వాళ్లని చిత్తకొట్టినట్లు కనిపిస్తోంది. అయితే గతంలో ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన వీడియో లో టైటిల్ గోల్డ్ కలర్ లో ఉంది. ఈ ఫస్ట్ లుక్ లో మాత్రం రక్తంతో నిండిపోయింది. దీంతో అది చూసిన నెటిజన్లు ఇందులో విలన్‌గా దాడి చేసేది రోలెక్స్ స్టార్ సూర్య అని కామెంట్స్ చేస్తున్నారు. కాగా, ఈ సినిమా ఈ ఏడాది అక్టోబర్ 19న థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజ్ కానుంది.

Also Read: స్టార్ హీరోలకు ధీటుగా సమంత.. ఆ విషయంలో తగ్గేదే లేదంట?

Next Story

Most Viewed