పేరు మార్చుకోబోతున్న విజయ్ దేవరకొండ.. కారణం అదేనా?

by Jakkula Samataha |
పేరు మార్చుకోబోతున్న విజయ్ దేవరకొండ.. కారణం అదేనా?
X

దిశ, సినిమా : విజయ్ దేవరకొండ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన తన నటనతో మంచి ఫేమ్ సంపాదించుకున్నాడు. ముఖ్యంగా అర్జున్ రెడ్డి సినిమా ఆయన కెరీర్‌నే మార్చేసి, ఓవర్ నైట్ స్టార్ హీరోను చేసేసింది. తర్వాత విజయ్ దేవర కొండ అంటే చాలు యూత్‌లో ఓ కొత్తరకం క్రేజ్ ఏర్పడింది.

విజయ్ దేవరకొండ అంటే యువకుల్లో వచ్చే వైబ్రేషనే వేరుగా ఉంటుంది. కానీ వారికి ఓ బిగ్ షాక్ తగలనుంది. అతి త్వరలో విజయ్ తన పేరు మార్చుకోబోతున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే గీతా గోవిందం తప్పితే తర్వాత నుంచి ఈయనకు ఫ్లాప్స్‌నే ఎక్కువగా వస్తున్నాయి. దీంతో విజయ్ ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అర్జున్ రెడ్డి, గీతా గోవిదం తప్పితే వావ్ అనిపించే సూపర్ హిట్ సినిమాలే ఈయన ఖాతాలో లేవు, ట్యాక్సీవాలా పర్వాలేదు అనిపించింది. ఇక పాన్ ఇండియాలెవల్లో తెరకెక్కిన లైగర్ అట్టర్ ఫ్లాప్ అయ్యింది. ఖుషి సినిమా కూడా సోసోగా ఉంది. దీంతో మన రౌడీ హీరో అయోమయంలో పడిపోయాడంట. సినిమాలు ఫ్లాప్స్ కావడంతో తీవ్ర మనోవేదనకు గురి అవుతుండటంతో తన తల్లి ఆయన జాతకం చూయించినట్లు తెలుస్తోంది. దీంతో జ్యోతిష్యుడు, విజయ్ పేరు మార్చుకుంటే కలిసి వస్తుందని చెప్పారంట. ఈ నేపథ్యంలోనే తాను పేరు మార్చుకోబోతున్నట్లు తెలుస్తోంది. అయితే తన తల్లి అంటే విజయ్‌కు చాలా ఇష్టం. ఆమె ఆనందంగా ఉంటుంది అంటే చాలు ఏ పనినైనా చేస్తాడు. అలాంటి వ్యక్తి, ఆమె పేరు మార్చుకోమని కోరుతుండటంతో కాదు అనలేక ఓకే చెప్పాడంట. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. కాగా, మరి నిజంగానే విజయ్ పేరు మార్చుకుంటున్నారా? లేదా ఇది కూడా ఓ రూమరో తెలియాల్సి ఉంది.

Advertisement

Next Story

Most Viewed