- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
విజయ్ దేవరకొండ చేసిన పనికి లైవ్‌లోనే కన్నీళ్లు పెట్టుకున్న ట్రాన్స్‌జెండర్ (వీడియో)
దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుతం విజయ్ దేవరకొండ ‘ఫ్యామిలీ స్టార్’ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నాడు. వరుసగా కుటుంబ నేపథ్యంలో సాగే సినిమాలు విజయ్ ఎంచుకుంటుండటంతో అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. అటూ సినిమాలతోనే కాకుండా పలువురికి హెల్ప్ చేస్తూ కూడా మంచి ఈమేజ్ సొంతం చేసుకుంటున్నాడు. తన సినిమాల ద్వారా వచ్చిన డబ్బుతోనే కాకుండా.. కరోనా టైంలో కూడా ఫౌండేషన్ పేరిట ఎంతో మంది కుటుంబాలకు సరుకులు పంచడం లాంటివి చేశాడు విజయ్. ఈ క్రమంలోనే గతంలో విజయ్ అందించిన సహాయం తలుచుకుని లైవ్‌లోనే కన్నీళ్లు పెట్టుకుంది ట్రాన్స్‌జెండర్.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ట్రాన్స్‌జెండర్ మాట్లాడుతూ.. ‘కరోనా టైంలో లాక్‌డౌన్ పెట్టారు. ఆ సమయంలో మాకు తినడానికి తిండి కూడా దొరకలేదు. రూం రెంట్ కట్టుకునేందుకు కూడా డబ్బులు లేక చాలా ఇబ్బంది పడ్డాము. అలాంటి టైంలో విజయ్ దేవరకొండ ఫౌండేషన్ గురించి తెలిసి.. దాంట్లో ఫాం నింపాను. వెంటనే టీం రియాక్ట్ అయింది. సరుకులు కొనుక్కునేందుకు ఫోన్ పే ద్వారా డబ్బులు షేర్ చేశారు. ఆ రోజు పొందిన సహాయాన్ని ఎప్పటికీ మరిచిపోను.. నాలానే చాలా మంది ట్రాన్స్‌జెండర్లకు సహాయం చేశారు ఆయన’ అంటూ విజయ్ దేవరకొండ గురించి చెబుతూ ఎమోషనల్ అయింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. విజయ్‌పై నెట్టింట ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు నెటిజన్లు.