- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వారిపై దారుణమైన కామెంట్స్ చేసి వివాదంలో చిక్కుకున్న విజయ్ ఆంటోనీ.. క్షమాపణ చెప్పాలని డిమాండ్!!
దిశ, సినిమా: సంగీత దర్శకుడిగా, డైరెక్టర్ గా, సినీ హీరోగా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు విజయ్ ఆంటోని. వైవిధ్యమైన సినిమాలను ఎంపిక చేసుకుంటూ ప్రేక్షకులను అలరిస్తున్నాడు. ప్రస్తుతం విజయ్ లవ్ గురు మూవీలో నటిస్తున్నాడు. విజయ్ ఫస్ట్ టైమ్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ జానర్ లో నటిస్తున్న సినిమా ఇది. వినాయక్ వైద్య నాథన్ దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రంలో మృణాళిని కథానాయికగా నటిస్తోంది.
ఈ సినిమాను రంజాన్ పండుగ సందర్భంగా ఏప్రిల్ 11 వ తారీకున థియేటర్లలో గ్రాండ్ రిలీజ్ చేయనున్నారు. అయితే తాజాగా విజయ్ ఓ యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సంచలన కామెంట్స్ చేశారు. ‘‘మద్యం సేవించే విషయంలో స్త్రీ పురుష భేదాలు ఏంటి? మందు తాగడం అనే కామన్. పురాతన కాలంలో కూడా మందు తాగేవారు. దాన్ని కాలానుగుణంగా పేరు మార్చుకుంటూ వస్తున్నారు. సారా అనే పేరుతో గతంలో మద్యం సేవించేవాళ్లు.
ఇప్పుడు కూడా పెద్ద పెద్ద కంపెనీలు ఉత్పత్తి చేసి.. పలు రకాల పేర్లతో మద్యాన్ని అమ్ముతున్నారు. దాన్నే మనం తాగుతున్నాం. యేసుక్రీస్తు కూడా ద్రాక్షరసం తాగారు’’. అంటూ విజయ్ ఆంటోని చెప్పుకొచ్చారు. విజయ్ చేసిన ఈ కామెంట్స్ ను తమిళనాడు క్రైస్తవ సమాఖ్య తీవ్రంగా ఖండించింది. బహిరంగంగా క్షమాపణ చెప్పాలని.. లేకపోతే విజయ్ ఆంటోని ఇంటి ముందు ఆందోళన చేస్తామని హెచ్చరించింది. దీంతో విజయ్ క్రైస్తవులందరికీ క్షమాపణలు చెప్పాడని సమాచారం.
- Tags
- Vijay Antony