Venu swamy: మరో 6 నెలల్లో ఆ స్టార్ హీరోయిన్ విడాకులు తీసుకుంటుందని బిగ్‌ బాంబ్ పేల్చిన వేణుస్వామి..

by Kavitha |
Venu swamy: మరో 6 నెలల్లో ఆ స్టార్ హీరోయిన్ విడాకులు తీసుకుంటుందని బిగ్‌ బాంబ్ పేల్చిన వేణుస్వామి..
X

దిశ, సినిమా: ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈయన సెలెబ్రెటీల జాతకాలను చెబుతూ చాలా ఫేమస్ అయ్యారు. నటీనటుల పెళ్లి సమయంలో వారి జాతకాలు చూసి వీరికి పెళ్లి అచ్చు రాదు.. విడాకులు తీసుకుంటారు అని చెప్పిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ముఖ్యంగా సమంత - నాగచైతన్య విడాకులు తీసుకుంటారు అని బిగ్‌బాంగ్ పేల్చిన సంగతి తెలిసిందే. అలా ఈయన చెప్పిన తర్వాత వీరు నిజంగానే విడాకులు తీసుకున్నారు. దీంతో వేణు స్వామి జాతకాలు నిజమవుతాయని సెలబ్రిటీలు సైతం అతని వద్దకు వెళ్లి జాతకాలు చెప్పించుకున్నారు. కానీ, ఏపీ ఎలక్షన్స్ టైంలో మళ్లీ జగన్ గెలుస్తాడని కూటమి అధికారంలోకి రాదని, పవన్ కళ్యాణ్ ఓడిపోతాడని చెప్పాడు. అతను చెప్పినట్టు కాకుండా ఈ సారీ ఏపీలో కూటమి గెలిచింది. దీంతో తప్పుడు జాతకం చెప్పినందుకు క్షమించమని, ఇప్పటి నుంచి సెలబ్రిటీల జాతకాలు చెప్పననీ బహిరంగంగా వారి గురించి ఏ విషయాలు చెప్పనంటూ ఓ వీడియో రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. కాగా గతంలో రకూల్ వైవాహిక జీవితం బాగోదని, ఆమెకు పెళ్లి కలిసిరాదని, విడాకులు తీసుకుంటుందని చెప్పిన వేణు స్వామి ఇప్పుడు మరోమారు తన వైవాహిక జీవితంపై సంచలన కామెంట్స్ చేశాడు.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న వేణు స్వామి మాట్లాడుతూ.. రకుల్ ప్రీత్ సింగ్‌కి పెళ్లి చేసుకున్నాక ఎన్నో ఇబ్బందుల్లో చిక్కుకుంటుందని నేను ఇప్పటికే చెప్పాను. మరోసారి ఈ విషయం గురించి చెబుతున్నాను. ఈమె మరో 6 మంత్స్‌లో విడాకులు తీసుకుంటుంది. ఇప్పటికే పెళ్లయ్యాక ఎన్నో ఇబ్బందులు ఫేస్ చేసింది. ఈ క్రమంలో భర్త జాకీ భగ్నాని పూజ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై అందులో పని చేసే వాళ్ళకి శాలరీ ఇవ్వడం లేదని చెప్పడం, అలాగే ఆ బ్యానర్ పై చేసిన సినిమాలన్నీ ఫ్లాప్ అవ్వడం, రీసెంట్‌గా రకుల్ ప్రీత్ సింగ్ తమ్ముడు డ్రగ్స్ కేసులో చిక్కుకోవడం వంటివి జరిగాయి. దీంతో రకుల్ ప్రీత్ సింగ్ విడాకులు కూడా మరో ఆరు నెలల్లో ఉండబోతున్నాయి అంటూ వేణు స్వామి బిగ్‌బాంబ్ పేల్చాడు. ప్రస్తుతం ఈ కామెంట్స్ నెట్టింట వైరల్‌గా మారాయి.


Advertisement

Next Story