సమంత రెండో పెళ్లి, శ్రీజ మూడో పెళ్లి.. వీరి జీవితంలో జరిగేది ఇదేనంట !

by samatah |   ( Updated:2023-08-02 06:35:40.0  )
సమంత రెండో పెళ్లి, శ్రీజ మూడో పెళ్లి.. వీరి జీవితంలో జరిగేది ఇదేనంట  !
X

దిశ, వెబ్‌ డెస్క్ : ప్రముఖ ఆస్ట్రాలజర్ వేణు స్వామి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సెలబ్రిటీలు, రాజకీయనాయకుల జాతకం చెప్తూ చాలా ఫేమస్ అయ్యాడు. ముఖ్యంగా సమంత నాగచైతన్య, విడిపోతారని చెప్పడం, వారు నిజంగానే విడాకులు తీసుకొని విడిపోవడంతో వేణు స్వామి ఓవర్ నైట్ సెలబ్రిటీ లిస్ట్‌లో చేరిపోయాడు.

అయితే ఈయన తాజాగా సమంత, మెగా డాటర్ శ్రీజలకు సంబంధించిన ఆసక్తికర విషయాలు వెల్లడించిన విషయం తెలిసిందే. సమంత జాతకం బాగోలేదని, ఒక వేళ ఆయన రెండో పెళ్లి చేసుకున్నా అనారోగ్యంతో పాటు అనేక సమస్యలు తలెత్తుతాయంటూ వేణు స్వామి షాకింగ్ కామెంట్స్ చేశారు.

అలాగే శ్రీజది సేమ్ పవన్ కళ్యాణ్ జాతకం అని, శ్రీజ కూడా మూడో పెళ్లి చేసుకుంటుంది. కానీ మూడో పెళ్లి చేసుకున్నా ఆమె జీవితం సవ్యంగా ఉండదు, అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందంటూ సంచలన విషయాలు తెలియజేశాడు. ప్రస్తుతం ఆయన వీరిద్దరిపై చేసిన కామెంట్స్ తెగ వైరల్ అవుతున్నాయి. దీంతో సంత ఫ్యాన్స్, మెగా ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. పెళ్లి చేసుకున్నా వారి జీవితం బాగుండదా, సమంతకు మళ్లీ అనారోగ్య సమస్యలు వస్తాయా అంటూ తమ బాధను వ్యక్తపరుస్తున్నారు.

Read More: టిల్లుగాడితో రొమాన్స్‌కు రష్మిక గ్రీన్ సిగ్నల్.. ఆమె డైరెక్షన్‌లోనే సిద్ధు నెక్ట్స్ మూవీ

Advertisement

Next Story

Most Viewed