చరిత్రలో మొదటిసారి.. ఊహించని రెమ్యునరేషన్‌తో బిగ్ బాస్ హౌస్‌లోకి వేణుస్వామి?

by Jakkula Samataha |   ( Updated:2024-07-04 08:50:38.0  )
చరిత్రలో మొదటిసారి.. ఊహించని రెమ్యునరేషన్‌తో బిగ్ బాస్ హౌస్‌లోకి వేణుస్వామి?
X

దిశ, సినిమా : ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. బాలీవుడ్ టు టాలీవుడ్‌లో స్టార్ హీరో, హీరోయిన్స్ జాతకాలు చెబుతూ ఈయన చాలా ఫేమస్ అయ్యారు. సినీ సెలబ్రిటీలే కాకుండా రాజకీయ నాయకులు, క్రీడాకారుల జాతకాలు కూడా ఈయన చెప్తూ వార్తల్లో నిలుస్తుండే వాడు. అయితే టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత, నాగచైతన్య పెళ్లి చేసుకునే సమయంలో వీరు విడాకులు తీసుకొని విడిపోతారని చెప్పుకొచ్చాడు. దీంతో ఆయన చెప్పింది నిజమై, వారు వివాహం జరిగిన నాలుగు సంవత్సరాలకు డివోర్స్ తీసుకున్నారు. దీంతో ఈయన ఓవర్ నైట్ స్టార్ ఆస్ట్రాలజర్ అయిపోయారు.ఇక అప్పటి నుంచి నటీనటుల జాతకాలు చెప్తూ సోషల్ మీడియాలో ఎప్పుడూ ట్రెండింగ్‌లో ఉంటున్నాడు. అయితే ప్రస్తుతం ఈయనకు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. అది ఏమిటంటే? వేణు స్వామి త్వరలోనే బిగ్ బాస్‌లోకి అడుగు పెట్టబోతున్నాడంట. బిగ్ బాస్ తెలుగు సీజన్‌8లో ఈయన కంటెస్టెంట్‌గా ఫిక్స్ అయినట్లు అనేక వార్తలు వస్తున్నాయి.

అంతే కాకుండా ఈయనకు ఇచ్చే రెమ్యునరేషన్ చూసిన నెటిజన్లు తెగ షాక్ అవుతున్నారు. సోషల్ మీడియాలో వేణు స్వామికి ఉన్న పాపులారిటీని దృష్టిలో పెట్టుకొని బిగ్ బాస్ యాజమాన్యం ఈయనకు కోటి రుపాయల రెమ్యునరేషన్ ఇచ్చి కంటెస్టెంట్‌గా హౌస్‌లోకి పంపించడానికి రెడి అయినట్లు సమాచారం. మొదటగా ఆయన అడిగిన రెమ్యునరేషన్ విని షాకైన టీం, తర్వాత ఆయన పాపులారిటీని గుర్తించి ఒకే చెప్పిందంట. దీంతో ఈయన బిగ్ బాస్ హౌజ్‌లో సందడి చేయడానికి రెడీ అయినట్లు సమాచారం.

Advertisement

Next Story

Most Viewed