సెలబ్రిటీల జాతకాలు చెప్పే వేణు స్వామి లీలలు.. ఆమెతో సీక్రెట్‌గా లవ్

by samatah |   ( Updated:2023-03-27 12:57:30.0  )
సెలబ్రిటీల జాతకాలు చెప్పే వేణు స్వామి లీలలు.. ఆమెతో  సీక్రెట్‌గా లవ్
X

దిశ, వెబ్‌డెస్క్ : ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. ఈయన సెలబ్రిటీల జాతకాలు చెబుతూ చాలా ఫేమస్ అయ్యాడు. ముఖ్యంగా సమంత, నాగచైతన్య విడాకులు తీసుకుంటారని చెప్పడం అది నిజం అవ్వడంతో ఈయనకు ఫ్యాన్ ఫాలోయింగ్ చాలా పెరిగిపోయింది. అంతేకాకుండా ఆ తర్వాత ప్రభాస్, రష్మిక, రకుల్ ప్రీత్ సింగ్, విజయ్ దేవరకొండ ఇలా పలువురు హీరో, హీరోయిన్లపై చేసిన కామెంట్స్ నెట్టింట్లో తీవ్ర దుమారాన్ని రేపాయి.

ఈ క్రమంలో వేణుస్వామి పర్సనల్ లైఫ్‌కు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అది ఎమిటంటే , ఆయన లవ్ స్టోరీ, అవునూ మీరు విన్నది నిజమే, ఆయనకు ఓ రొమాంటిక్ లవ్ స్టోరీ ఉంది, దానిపై మీరూ ఓ లుక్ వేయండి.

కెరీర్ ఆరంభంలో ఎన్నో క‌ష్టాల‌ను ఎదుర్కొన్నారట వేణు స్వామి. ఆ సమయంలోనే ఓ అమ్మాయితో ప్రేమ‌లో పడి పెళ్లి చేసుకున్నారట. అయితే వేణు స్వామి సతీమణి మరెవరో కాదు వీణ వాయించ‌డం ద్వారా పాపులారిటీ పొందిన శ్రీవాణినే వేణు స్వామి వైఫ్.

అయితే ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. వేణుస్వామితో తన లవ్ స్టోరీ గురించి ఓపెన్ అయ్యింది. మాది లవ్ మ్యారేజ్ అంటూ తన పెళ్లికి సంబంధించిన చాలా విషయాలను పంచుకుంది. అలాగే వేణు స్వామినే నాకు మొదట ప్రపోస్ చేశాడు,తన కజిన్ డాటర్ ని తీసుకువెళ్ళడానికి ఒకసారి ఆయన మా ఇంటికి వచ్చారు. అప్పుడు నన్ను చూసి పెళ్లి చేసుకుంటే ఈ అమ్మాయినే చేసుకుంటాను అని చెప్పారట. అలా నన్ను కలవడం, ప్రపోజ్ చేయడం, పెళ్లి కూడా జరిగిపోయింది. ఇప్పుడు మేము చాలా సంతోషంగా ఉంటున్నాం అంటూ వీణ శ్రీవాణి తెలిపింది.

Read more:

పొట్టోడు అంటూ రామ్ చరణ్‌ను అవమానించిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్?

Advertisement

Next Story

Most Viewed