ఆ హీరోయిన్‌తో ప్రత్యేక పూజలు చేయించిన వేణు స్వామి.. అబద్ధాలు చెప్పిన వదలరా అంటున్న నెటిజన్స్!

by Jakkula Samataha |   ( Updated:2024-06-14 03:59:19.0  )
ఆ హీరోయిన్‌తో ప్రత్యేక పూజలు చేయించిన వేణు స్వామి.. అబద్ధాలు చెప్పిన వదలరా అంటున్న నెటిజన్స్!
X

దిశ, సినిమా : ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పని లేదు. సమంత, చైతూ విడిపోతారని చెప్పడం, నిజంగానే వారు విడిపోవడంతో ఈయన ఓవర్ నైట్ స్టార్ సెలబ్రిటీ అయిపోయారు. అప్పటి నుంచి వేణు స్వామి సెలబ్రిటీలు, రాజకీయ ప్రముఖుల జాతకాలు చెబుతూ ఎప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూనే ఉంటున్నాడు. అయితే ఈ మధ్య ఏపీలో మళ్లీ వైసీపీనే అధికారంలోకి వస్తుంది, జగన్ మళ్లీ సీఎం అవుతారని చెప్పిన విషయం తెలిసిందే.కానీ ఎవరూ ఊహించని విధంగా కూటమి విజయం సాధించింది. వేణు స్వామి చెప్పింది రాంగ్ అయిపోయింది. దీంతో ఆయన మళ్లీ జాతకం చెప్పను, నన్ను క్షమించండి అంటూ ఓ వీడియో విడుదల చేసిన విషయం తెలిసిందే. దీంతో ఆయన్ను సోషల్ మీడియలో నెటిజన్స్ తెగ ఆడుకున్నారు. ఇక వేణు స్వామి కనిపించరేమో అని అందరూ అనుకున్నారు. కానీ ఓ హీరోయిన్‌తో పూజలు జరిపిస్తూ ఆయన మరో సారి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నారు.

వేణు స్వామి చెప్పిన జాతకం పట్టు తప్పుతున్న ప్పటికీ ఆయనను హీరోయిన్స్ వదలడం లేదు. తాజాగా కన్నడ బ్యూటీ నిశ్విక వేణుస్వామి వద్దకు వచ్చి పూజలు చేయించుకున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. గతంలో రష్మిక, నిధి అగర్వాల్ కూడా ఈయనతో పూజలు జరిపించుకున్న విషయం తెలిసిందే, ఇప్పుడు వీరి ఖాతాలో నిశిక కూడా చేరింది. ఇక ఈ ఫోటోలు చూసిన నెటిజన్స్ ఫన్నీ కామెంట్స్ చెప్తున్నారు. తప్పు చెప్పినా హీరోయిన్స్ ఈయన్ని వదలడం లేదు, రాను రాను వేణు స్వామి పాన్ ఇండియా జ్యోతిష్యుడు అవుతాడేమో అంటూ సరదా కామెంట్స్ చేస్తున్నారు.

Advertisement

Next Story