ప్రభాస్ ఏ సినిమా తీసినా ఫ్లాపే.. వేణుస్వామి షాకింగ్ కామెంట్స్

by samatah |   ( Updated:2023-10-10 16:09:58.0  )
ప్రభాస్ ఏ సినిమా తీసినా ఫ్లాపే.. వేణుస్వామి షాకింగ్ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్ : వేణు స్వామి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సెలబ్రిటీల జాతకాలు చెబుతూ ఆయన చాలా ఫేమస్ అయ్యాడు. ఇక ఇప్పటికే చాలా మంది హీరో, హీరోయిన్ల జాతకం చెప్పగా వాటిలో చాలా వరకు నిజమయ్యాయి.

అయితే ఆయన తాజాగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు.ప్రభాస్ ఏ మూవీ రిలీజైన ఆయన, దానికి ముందు వేణు స్వామి కామెంట్స్ చేయడం కామన్. కాగా, ఆదిపురుష్ సినిమా రిలీజ్ ముందు కూడా ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. అంతే కాదు ప్రభాస్‌తో సినిమాలు తీయాలి అనుకున్న వారు కచ్చితంగా జాతకం చూపించుకోవాలి. లేకపోతే పెట్టిన బడ్జెట్ కూడా తిరిగి రాదు అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. ప్రస్తుతం ఆయన చేసిన ఈ వాఖ్యలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

అయితే తాజాగా విడుదలైన ఆది పురుష్ సినిమా కాస్తా నెగటివ్ టాక్ తెచ్చుకోవడం తో మరోసారి సోషల్ మీడియాలో తన కామెంట్ల తో రెచ్చిపోయాడు వేణు స్వామి. ఆయన మాట్లాడుతూ.. నేను ఇప్పటివరకు ఎంతోమంది సెలబ్రిటీల జాతకాలు చూసాను. కానీ ప్రభాస్ లాంటి జాతకం ఎవరికి లేదు. ప్రభాస్ ది మాత్రమే కాదు రాజమౌళి జాతకం కూడా అలాగే ఉంది. ప్రభాస్ జాతకంలో దోషం ఉంది. కానీ ఆయన జాతకాలని నమ్మడు.. ఇక ప్రభాస్ ఇప్పటి నుండి ఏ సినిమా తీసినా కూడా అది ప్లాఫ్ అవుతుంది. అంతే కాదు ప్రభాస్‌తో సినిమా తీసే ముందు నిర్మాతలు ఒకసారి జాతకం చూపెట్టుకోవాలి. లేకపోతే పెట్టిన బడ్జెట్ కూడా తిరిగి రాదు అంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు. ప్రస్తుతం ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

Advertisement

Next Story