Astrologer Venu Swamy : ఫలించిన వేణు స్వామి పూజలు.. బంఫర్ ఆఫర్!

by Anjali |   ( Updated:2023-08-23 06:27:51.0  )
Astrologer Venu Swamy : ఫలించిన వేణు స్వామి పూజలు.. బంఫర్ ఆఫర్!
X

దిశ, వెబ్‌డెస్క్: తరచూ సినీ సెలబ్రిటీలు, రాజకీయ నాయకుల జాతకాలు చెబుతూ వార్తల్లో నిలుస్తారు వేణుస్వామి. ఈయన చెప్పినట్లుగానే కొన్ని నిజాలు కావడంతో ఈ జ్యోతిష్యుడు ఏం చెప్పినా కూడా ఇండస్ట్రీలో, సోషల్ మీడియాలో ఆ విషయం మీద తీవ్ర చర్చ జరుగుతుంది. అయితే వేణుస్వామితో పూజలు చేయించుకుంటే మంచి ఛాన్స్‌లు వస్తాయని కొంతమంది హీరోయిన్లు ఈయనతో ప్రత్యేక పూజలు చేపించుకున్నారు. అందులో రష్మిక ఒకరు.

ఈ భామ పాన్ ఇండియా లెవల్‌లో తెరకెక్కిన పుష్ప చిత్రంతో ఏకంగా స్టార్ హీరోయిన్ అయ్యింది. ఆ తర్వాత ఇస్మార్ట్ శంకర్ హీరోయిన్ ‘నిధి అగర్వాల్’ తో కూడా పూజలు చేయించారు. ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కల్యాణ్ జంటగా భారీ ఆఫర్ దక్కించుకుంది. తాజాగా ప్రభాస్ సరసన కూడా మరో అవకాశం రావడంతో ఇక వేణుస్వామి పూజలు ఫలించాయి కదా అంటూ టాలీవుడ్ ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది. ప్రస్తుతం జనాలు నెట్టింట వేణుస్వామి గురించే చర్చించుకుంటున్నారు.

Read More : ఫైనల్లీ నన్ను అర్థం చేసుకునే వారు దొరికారంటూ.. సమంత పోస్ట్

Advertisement

Next Story

Most Viewed