ఏకంగా ముగ్గురు హీరోయిన్లతో రాబోతున్న వరుణ్ తేజ్ ..

by Kavitha |   ( Updated:2024-03-16 15:23:07.0  )
ఏకంగా ముగ్గురు హీరోయిన్లతో రాబోతున్న వరుణ్ తేజ్ ..
X

దిశ, సినిమా: సంవత్సరానికి ఒక సినిమాతో కనిపిస్తున్న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్.. 2023లో ‘గాంధీవధారి అర్జున’, 2024 లో ‘ఆపరేషన్ వాలెంటైన్’ వంటి సినిమాలతో వచ్చాడు కానీ ఈ రెండు సినిమాలు ఏ మాత్రం పెద్దగా ఆకట్టుకోలేకపోయారు చివరగా 2022లో ‘ఎఫ్ 3 : ఫన్ అండ్ ఫ్రస్టేషన్’ తో హిట్ అందుకున్న వరుణ్ ఇప్పటి వరకు మరో హిట్ అందుకోలేదు. తను తీసే సినిమాల్లో కంటెంట్ భాగునప్పటికి కూడా ప్రేక్షకులను చేరుకోవడం లేదు.

కాగా ప్రజెంట్ ఇప్పుడు వరుణ్ తేజ్ ఆశలన్నీ తన తదుపరి సినిమా ‘మట్కా’ పైనే పెట్టుకున్నారు. కరుణ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో వరుణ్ పూర్తి డిఫరెంట్ లుక్‌లో కనిపించనున్నాడు. ఇక ఈ మూవీలో మీనాక్షి చౌదరి మెయిన్ హీరోయిన్‌గా కనిపించనుందని తెలిసినప్పటికి.. తాజాగా ఒక ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది.

ఈ మూవీలో బాలీవుడ్ నటి నోరా ఫతేహి కూడా కీలక పాత్రలో కనిపించనుందట.తన పాత్ర షూటింగ్ కోసం నోరా ఏకంగా 36 రోజులపాటు కాల్ షీట్ లు ఇచ్చిందట. దీంతోపాటుగా ‘మర్యాద రామన్న’ ఫేమ్ సలోని కూడా పవర్ ఫుల్ పొలిటికల్ పాత్రలో కనిపించబోతుంది. మొత్తానికి ముగ్గురు హీరోయిన్‌లతో రాబోతున్న ఈ కథతో వరుణ్ ఏ మాత్రం హిట్ పడుతుందో చూడాలి.

Read More..

ఎట్టకేల‌కు విక్రమ్ ‘ధృవ న‌క్షత్రం’ మూవీ విడుదల తేదీని ప్రకటించిన మేకర్స్..

Advertisement

Next Story