విమర్శల వల్ల ఫ్యామిలీపై ప్రభావం.. ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపా అంటూ Varun కామెంట్స్

by Hamsa |   ( Updated:2023-07-26 15:08:20.0  )
విమర్శల వల్ల ఫ్యామిలీపై ప్రభావం.. ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపా అంటూ Varun కామెంట్స్
X

దిశ, వెబ్ డెస్క్: బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ ప్రస్తుతం వరుస చిత్రాల్లో నటిస్తున్నాడు. అయితే ఇటీవల జాన్వి కపూర్‌తో కలిసి నటించిన ‘బవాల్’ సినిమా నేరుగా ఓటీటీలో విడుదలై మంచి విజయాన్ని సాధించింది.

తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న వరుణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘ నాకు విమర్షలు కొత్తేమి కాదు. గతంలో నేను నటించిన సూపర్ హిట్ చిత్రాలను కూడా కొందరు విమర్శించారు. ఎలాంటి పాత్రలైనా సినిమాకు అనుగుణంగా రాస్తారని వారు గుర్తించరు. సినీ ఇండస్ట్రీలో ఉన్న గొప్ప నటీనటులు కూడా వీటిని ఎదుర్కొన్నారు. కానీ, నేను విమర్శలను గౌరవిస్తాను. ఎందుకంటే ఏ విషయంలోనైనా అందరికీ ఒకే అభిప్రాయం ఉండాలని అనుకోను. ఒకప్పుడు వీటి గురించి ఆలోచించేవాడిని. ఆ సమయంలో ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాను. ఆ ప్రభావం నా కుటుంబ సభ్యులపై కూడా పడింది. కానీ, ఇలాంటి వాటి గురించి ఆలోచించడం మానేశాను’’ అంటూ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం వరుణ్ ధావన్, సమంతతో కలిసి నటించిన ‘సిటాడెల్’ వెబ్‌ సిరీస్ రిలీజ్ కోసం ఎదురుచూస్తున్నారు.

Advertisement

Next Story