ఓటీటీలో భయపెడుతున్న దెయ్యం మూవీ.. వళరి రివ్యూ ఇదే!

by Jakkula Samataha |
ఓటీటీలో భయపెడుతున్న దెయ్యం మూవీ.. వళరి రివ్యూ ఇదే!
X

దిశ, సినిమా : హారర్ మూవీ అంటే ఎవరికి ఇంట్రెస్ట్ ఉండదు. చాలా మంది భయంతో ఎంతో ఆసక్తిగా చూస్తుంటారు. కాగా, గురు సినిమాలో హీరోయిన్‌గా నటించి అందరినీ ఆకట్టుకున్న నటి రితికా సింగ్ చాలా కాలం తర్వాత నటించిన మూవీ వళరి. ఎం మృతిక సంతోషిణి అనే లేడి డైరెక్టర్ దర్శకత్వం‌లో హారర్ అండ్ థ్రిలర్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో హీరో శ్రీరామ్, రితికా సింగ్ ప్రధాన పాత్రల్లో నటించారు.అయితే ఈ సినిమా మార్చి6 అర్ధరాత్రి నుంచి ప్రముఖ ఓటీటీ సంస్థ ఈటీవీ విన్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. కాగా, ఓటీటీ నుంచి ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తుంది.చాలా రోజుల తర్వాత జనం భయపడేలా ఉందంటూ ప్రేక్షకులు ముచ్చటటిస్తున్నారు. ప్రతీ క్షణం టెన్షన్ టెన్షన్‌గా సీన్స్ కొనసాగుతుంటాయంట.

వెంకటాపురం బంగ్లాలో దెయ్యాలు ఉన్నాయని ఊర్లో వాళ్లంతా అనుకుంటూ ఉంటారు. అదే సమయంలో శ్రీరామ్ తన భార్య రితికా సింగ్(దివ్య) తో కలిసి ఆ ఇంట్లోకి కుటుంబంతో సహా దిగుతాడు. కలలో 13 ఏళ్ల పాప కనిపించడం,తల్లిదండ్రులను చంపినట్టు కల రావడం జరుగుతుంది. అంతే కాకుండా ఆ బంగ్లాలోకి వెళ్లాక వారికి ఊహించని పరిస్థితులు ఎదురవుతాయి.అయితే బంగ్లాకు, దివ్యకు ఏంటి సంబంధం? దివ్య కలలో కనిపించే 13 ఏళ్ల పాప ఎవరు అనేది ఈ సినిమా.

ఇక ఈ సినిమా భయపెట్టడంలో సక్సెస్ కావడమే కాకుండా, చాలా ఉత్కంఠ నెలకొలిపింది. ఇక ఈ మూవీకి ఓటీటీ వేదికగా మంచి రెస్పాన్స్ వస్తుంది. వళరి మూవీలో శ్రీరామ్, రితికా సింగ్ తన నటనతో ఆకట్టుకున్నారు. బాలనటులు సుబ్బరాజు, ఉత్తేజ్ కూడా తమ నటనతో అందరినీ అలరించారనే చెప్పవచ్చు. ఎమోషన్. థ్రిలింగ్ ‌తో ఈ మూవీ ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటుంది.

Advertisement

Next Story

Most Viewed