Ustaad Bhagat Singh: పవర్ స్టార్ వచ్చేశాడు.. ఉస్తాద్ భగత్ సింగ్ కొత్త షెడ్యూల్ స్టార్ట్..

by Vinod kumar |   ( Updated:2023-09-15 14:39:18.0  )
Ustaad Bhagat Singh: పవర్ స్టార్ వచ్చేశాడు.. ఉస్తాద్ భగత్ సింగ్ కొత్త షెడ్యూల్ స్టార్ట్..
X

దిశ, వెబ్‌డెస్క్: పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా సినిమా 'ఉస్తాద్ భగత్ సింగ్'. రాజకీయ కారణాలతో చిన్న బ్రేక్ తీసుకున్న పవన్ కల్యాణ్.. మళ్లీ ఈ మూవీ సెట్స్‌లోకి వచ్చిన ఫొటోస్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. హరీష్ శంకర్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా నుంచి కూడా కీలకమైన అప్డేట్ వచ్చేసింది. సెట్స్‌లో పవన్‌కు సీన్ వివరిస్తున్న హరీష్ శంకర్ ఫొటోతోపాటు పవన్ స్టైలిష్‌గా నడుచుకుంటూ వస్తున్న ఫొటో కూడా ఇప్పుడు వైరల్ అవుతోంది. ఈ సినిమాకి సంబంధించిన ఫొటోలనే మేకర్సే సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. నాన్ స్టాప్ షెడ్యూల్ ప్రస్తుతం జరుగుతోందని మేకర్స్ వెల్లడించారు. ఈ సినిమాను నవీన్ యెర్నేని, రవిశంకర్ కలిసి మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌లో నిర్మిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు. అశుతోష్ రాణా, గౌతమి, నాగ మహేష్, కేజీఎఫ్ ఫేమ్ అవినాష్ ఈ సినిమాలో కీలకపాత్రల్లో నటిస్తున్నారు.

ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేయడంతో అర్ధంతరంగా అక్కడికి వెళ్లిన పవన్.. కొన్ని రోజుల పాటు షూటింగ్‌కు దూరంగా ఉన్నాడు. ఇక ఇప్పట్లో షూటింగ్ ప్రారంభం కాదనుకుంటున్న సమయంలో సడెన్‌గా సెట్స్‌లో ప్రత్యక్షమయ్యాడు. గబ్బర్‌సింగ్ రూపంలో ఇండస్ట్రీ హిట్ ఇచ్చిన పవన్, హరీష్ శంకర్ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా కావడంతో ఉస్తాద్ భగత్ సింగ్‌పై భారీ అంచనాలే ఉన్నాయి.

Read More: పల్లవి ప్రశాంత్‌ రైతు అని చిన్న చూపు చూస్తున్నారు.. వారిపై ఫైర్ అయిన అఖిల్ సార్థక్

Next Story

Most Viewed