- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
కెమెరా ముందు ఏడవడం ఒక్కటే యాక్టింగ్ కాదు : ఊర్మిళ
దిశ, సినిమా : ఊర్మిళ మటోండ్కర్ తాను హీరోయిన్‌గా ఉన్నప్పుడు పలు పత్రికలు పబ్లిష్ చేసిన కథనాలపై మండిపడింది. 'రంగీలా' మూవీ సక్సెస్ తర్వాత కూడా విమర్శకులు తన గురించి నెగెటివ్‌గానే రాశారని గుర్తుచేసుకుంది. తన సెక్స్ అప్పీల్ వల్లనే సినిమా సక్సెస్ అయింది గానీ యాక్టింగ్ టాలెంట్ వల్ల కాదని విమర్శించడం పట్ల బాధపడింది. కేవలం కెమెరా ముందు కన్నీరు కార్చడమొక్కటే యాక్టింగ్ అనుకుంటే పొరపాటని, సెక్సీగా కనిపించడం కూడా అందులో భాగమేనని పేర్కొంది.
తాను పర్ఫార్మర్ కానప్పుడు 'హే రామా' సాంగ్ ఎలా చేయగలిగానని ప్రశ్నించింది. సినిమాకు సంబంధించి ప్రతీ పాటలోనూ పక్కింటి అమ్మాయి పాత్ర పర్‌ఫెక్ట్‌గా ట్రాన్స్‌ఫార్మ్ అయిందని, కానీ ఇది విమర్శకులకు అర్థం కాలేదని చెప్పింది. కాగా ఊర్మిళ కామెంట్స్‌కు సపోర్ట్ చేస్తున్న ఇండస్ట్రీ పీపుల్.. ట్విట్టర్ వేదికగా తనను అప్రిషియేట్ చేస్తున్నారు.