అల్లు అర్జున్ న్యూ మూవీపై అప్డేట్.. డైరెక్టర్ ఎవరంటే?

by Hamsa |   ( Updated:2024-07-15 10:27:32.0  )
అల్లు అర్జున్ న్యూ మూవీపై అప్డేట్.. డైరెక్టర్ ఎవరంటే?
X

దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ ఫుల్ ఫామ్‌లో దూసుకుపోతున్నాడు. ‘పుష్ప’ చిత్రంతో పాన్‌ ఇండియా హీరోగా గుర్తింపు పొందిన ఐకాన్ స్టార్ పుష్ప-2 మూవీ షూటింగ్‌లో ఫుల్ బిజీగా ఉన్నాడు. సుకుమార్‌ దర్శకత్వంలో మైత్రీమూవీ మేకర్స్‌, సుకుమార్‌ రైటింగ్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం డిసెంబర్‌ 6న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో.. తాజాగా అల్లు అర్జున్‌ నెక్ట్స్ ప్రాజెక్ట్ తమిళ దర్శకుడు నెల్సన్‌‌తో చేస్తున్నట్లు సమాచారం. ఆయన చెప్పిన కథ నచ్చడంతో అల్లు అర్జున్ నటించేందుకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చినట్లు టాక్.

ఇటీవల నెల్సన్‌ తమిళ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌తో 'జైలర్‌' లాంటి బ్లాక్‌బస్టర్‌ చిత్రాన్ని తెరకెక్కించిన విషయం తెలిసిందే. ఈ సినిమా విడుదల సమయంలోనే నెల్సన్‌ బన్నీకి వినిపించిన కథకు ఇప్పుడు పచ్చజెండా ఊపారట. యూనివర్శల్‌ కాన్సెప్ట్‌తో ఓ డిఫరెంట్‌ నేపథ్యంలో యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా ఉండబోతుందని సమాచారం. ఈ చిత్రాన్ని గతంలో అల్లు అర్జున్‌తో ‘రేసుగుర్రం’ చిత్రాన్ని నిర్మించిన నల్లమలుపు శ్రీనివాస్‌ (బుజ్జి) నిర్మించబోతున్నట్లు తెలుస్తోంది. దీంతో అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఖుల్ ఖుషీ అవుతున్నారు.

Advertisement

Next Story