కృష్ణంరాజును సొంత కూతురిలా చూసుకున్న ఉపాసన.. మరణానికి ముందు ఆయన ఏం చెప్పారంటే..

by Prasanna |   ( Updated:2023-12-24 14:32:41.0  )
కృష్ణంరాజును సొంత కూతురిలా చూసుకున్న ఉపాసన.. మరణానికి ముందు ఆయన ఏం చెప్పారంటే..
X

దిశ, సినిమా: మెగా కోడలు ఉపాసన గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. కోట్ల ఆస్తికి వారసురాలైనప్పటికీ రియల్ లైఫ్‌లో సింపుల్‌గా ఉండటానికే ఇష్టపడతుంది. సేవా కార్యక్రమాల నిర్వహణలో సైంతం ముందు వరుసలో ఉంటుంది. అయితే తాజాగా ఉపాసన, సీనియర్ హీరో కృష్ణం రాజుకి సంబంధించిన విషయం ఒకటి బయట పడింది. ఏంటంటే.. కృష్ణం రాజు మరణించడానికి ముందు కాలికి గాయమైన అపోలో ఆస్పత్రిలో చేరారు.

ఇక అపోలో ఉపాసన సొంత ఆస్పత్రి కాగా .. ఆమె కృష్ణంరాజు ఆరోగ్యం విషయం‌లో ఎంతో కేర్ తీసుకుందట. ఆ సమయంలో ‘ఉపాసన కన్న కూతురిలా నన్ను ఎంతో ప్రేమగా చూసుకుంది’ అని కృష్ణంరాజు చెప్పారట. ఇక గతంలో కృష్ణంరాజు చెప్పిన ఈ మాటలు సోషల్ మీడియాలో మరోసారి వైరల్ అవుతున్నాయి. నిజానికి కృష్ణం రాజు, చిరంజీవి కుటుంబాలకు మధ్య మంచి అనుబంధం ఉంది. అంతే కాదు.. కృష్ణంరాజు భార్య శ్యామలా దేవికి కూడా ప్రభాస్ తర్వాత అంత ఇష్టమైన హీరో చరణ్. ప్రభాస్ సినిమాలతో పాటు చరణ్ సినిమాలను సైతం ఆమె ఇష్టంగా చూస్తారట.

Read More..

నిహారిక చిన్నప్పటి క్యూట్ ఫొటో చూస్తే ముచ్చటేస్తుంది.. పక్కన మెగాస్టార్‌తో!

Advertisement

Next Story