ఉపాసన - బ్రాహ్మిణి - లక్ష్మీ ప్రణతి ఆ విషయంలో వారికి వారే వారికి లేరు సాటి..

by Kavitha |
ఉపాసన - బ్రాహ్మిణి - లక్ష్మీ ప్రణతి ఆ విషయంలో  వారికి వారే వారికి లేరు సాటి..
X

దిశ,సినిమా: రామ్ చరణ్ సతీమణి ఉపాసన, నారా లోకేష్ సతీమణి బ్రహ్మిణి, ఎన్ టీ ఆర్ సతీమణి లక్ష్మీ ప్రణతి అందరికీ సుపరిచితమే. ప్రస్తుత కాలంలో హీరోయిన్స్ ఎలాంటి దుస్తులు వేసుకుంటూ ఉంటారో మనకు తెలిసిందే. స్టార్ సెలబ్రిటీస్, డబ్బున్న పిల్లలు పొట్టి పొట్టి దుస్తులు ధరించి విచ్చలవిడిగా అందాలను ఆరబోస్తూ ఉంటారు.

అయితే కోట్ల ఆస్తి ఉన్న టాప్ స్టార్ సెలబ్రిటీ ఫ్యామిలీ నుంచి వచ్చిన ఉపాసన - నారా బ్రాహ్మణి -లక్ష్మీ ప్రణతి మాత్రం డ్రెస్సింగ్ విషయంలో ఏనాడు హద్దులు మీర లేదు . చక్కగా ఒంటినిండా కప్పుకున్న బట్టలు వేసుకొని సంప్రదాయంగా ఉంటారు. అలాగే మోడ్రన్ దుస్తులు ధరించిన అవి కూడా పద్ధతిగానే ధరిస్తారు. ఇప్పటివరకు మనం ఎక్కడ కూడా వీరిని హద్దులు మీరి పొట్టి బట్టలు వేసుకోవడం చూసి ఉండము. కానీ మిగతా స్టార్ హీరోల భార్యలు, కూతుర్లు, డైరెక్టర్ భార్యలు, ప్రొడ్యూసర్ల కూతుర్లు ఎలాంటి బట్టలు వేసుకొని సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుతూ ఉంటారో చూస్తూనే ఉన్నాము. ఇదే విషయాన్ని ట్రెండ్ చేస్తూ జనాలు ఈ ముగ్గురిని ఓ రేంజ్ లో పొగిడేస్తున్నారు. వీళ్ళు పద్ధతికి మారుపేరు అని ..ముగ్గురు ఒకే జాతికి సంబంధించిన వాళ్ళు అని ఓ రేంజ్ లో ప్రశంసిస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed