Bigg Boss 8 Telugu: బిగ్ బాస్‌ 8లోకి ఇద్దరు గ్లామర్ బ్యూటీలు ఎంట్రీ కన్ఫర్మ్‌..

by Prasanna |
Bigg Boss 8 Telugu: బిగ్ బాస్‌ 8లోకి ఇద్దరు గ్లామర్ బ్యూటీలు ఎంట్రీ కన్ఫర్మ్‌..
X

దిశ, సినిమా: తెలుగు బుల్లి తెర ప్రేక్షకులను ఎంతగానో ఎదురుచూస్తున్న బిగ్ బాస్ సీజన్ 8 ప్రోమో విడుదల చేసి అందరికీ షాక్ ఇచ్చారు. మొన్నటి వరకు బిగ్ బాస్ పై పలు వార్తలు వచ్చాయి. అయితే, అందరూ ఈ సారి ఎలా ఉంటుందో అంటూ కామెంట్స్ చేసారు. కానీ, ఎవరు ఊహించని విధంగా శుక్రవారం ప్రేక్షకులకు బిగ్ సర్ ప్రైజ్ ఇచ్చారు. సీజన్ 7 ఉల్టా పుల్టా అంటూ అందర్ని ఆకట్టుకున్నారు. ఈ సారి ‘ఒక్కసారి కమిట్ అయితే ఇక్కడ లిమిటే లేదు’ అంటూ నాగార్జున సూపర్ డైలాగ్ చెప్పి అందర్ని ఆశ్చర్యపరిచారు.

ప్రోమో వచ్చాక ఇక కంటెస్టెంట్స్ కు గురించి రోజుకో వార్త వైరల్ అవుతూనే ఉంది. తాజాగా రీతూ చౌదరి, విష్ణుప్రియ పేర్లు ఫిక్స్ అయినట్లు తెలుస్తుంది. అయితే, దీని గురించి ఓ ఇంటర్వ్యూలో ఇన్ డైరెక్టుగా కామెంట్స్ కూడా చేసారు. ‘బిగ్ బాస్ లోకి.. మీరు వెళ్లబోతున్నారా?’ అన్న ప్రశ్నకు.. చాలా షాకింగ్ ఆన్సర్ చెప్పింది విష్ణు ప్రియ. 10 కిలోల బరువు అని రోజూ ఫీల్ అవుతున్నా.. అక్కడికి వెళ్తే ఈజీగా తగ్గించుకోవచ్చంటూ కామెంట్స్ చేసింది. విష్ణు ప్రియ చెప్పిన దానికి జబర్దస్త్ నటి రీతూ చౌదరి కాపీ, పేస్ట్ అంటూ తన మనసులో ఉన్నది ఇలా బయటపెట్టేసింది. ఈ విధంగా ఇద్దరూ బ్యూటీలు బిగ్ హౌస్ లోకి అడుగుపెట్టనున్నారని తెలుస్తుంది.

Advertisement

Next Story

Most Viewed